Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ ఈసారైనా లక్కున్నోడేనా?

By:  Tupaki Desk   |   28 May 2018 5:07 PM GMT
ఆ డైరెక్టర్ ఈసారైనా లక్కున్నోడేనా?
X
గీతాంజలి మూవీతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీనే ఇచ్చాడు దర్శకుడు రాజ్ కిరణ్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను సాధించాడు. టాలీవుడ్ బ్యూటీ అంజలిని ప్రధాన పాత్రలో చూపిస్తూ.. శ్రీనివాసరెడ్డితో హీరో రోల్ చేయించి.. ఇంట్రెస్టింగ్ గా హారర్ కామెడీని రూపొందించి.. హిట్టు కొట్టేశాడు రాజ్ కిరణ్.

అయితే.. ఈ దర్శకుడు ద్వితీయ విఘ్నం మాత్రం దాటలేకపోయాడు. హిట్టొచ్చిన జోనర్ లోనే రూపొందించిన త్రిపుర ఆకట్టుకోలేకపోయింది. కలర్స్ స్వాతిని ఇలాంటి పాత్రలో అసలు చూడలేకపోయారు జనాలు. గతేడాది లక్కున్నోడు అంటూ మంచు విష్ణుతో కూడా ఓ కామెడీ సినిమాపై గట్టిగానే ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు రాజ్ కిరణ్.. సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పుడీ దర్శకుడు తన నెక్ట్స్ వెంచర్ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకుని మరీ సబ్జెక్ట్.. స్క్రిప్ట్ రెడీ చేసుకున్న రాజ్ కిరణ్.. తన కొత్త సినిమాను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా.. స్విట్జర్లాండ్ లలో జరిగిన సంఘటనలే ఈ చిత్రానికి మూలం అని అంటున్నారు. ఇంకా యాక్టర్లను సెలెక్ట్ చేయాల్సి ఉండగా.. చెబుతున్న ఫారిన్ కంట్రీస్ పేర్ల ప్రకారం.. ఈ సారి కూడా రాజ్ కిరణ్ మరోసారి హారర్ మూవీకే వెళ్లబోతున్నాడని చెబుతున్నారు. కాకపోతే.. ఈ సారి పూర్తి స్థాయిలో హారర్ మూవీ తీసే అవకాశాలు ఉన్నాయని టాక్.