Begin typing your search above and press return to search.

సెట్టయిన పెళ్లి చూపులు కాంబో

By:  Tupaki Desk   |   7 May 2018 6:39 AM GMT
సెట్టయిన పెళ్లి చూపులు కాంబో
X
టాలీవుడ్ లో చిన్న నిర్మాతలు ఆలోచన తీరు మారుతోంది. బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది అనే విషయంలో ఒక స్పెషల్ ప్లాన్ వేసుకొని సక్సెస్ అందుకుంటున్నారు. అలాంటి నిర్మాతల్లో రాజ్ కందుకూరి కూడా ఉన్నారు. పెళ్లి చూపులు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ నిర్మాత ఆ తరువాత మెంటల్ మదిలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక విధంగా ఉంటే నెక్స్ట్ సినిమా మరింత డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

అందుకోసం విజయ్ దేవరకొండ ను రంగంలోకి దింపనున్నాడు. మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న విజయ్ తో అలాగే మెంటల్ మదిలో దర్శకుడితో రాజ్ ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. మెంటల్ మదిలో దర్శకుడు వివేక్ ఆత్రేయ కు మొదటి సినిమాతోనే అగ్ర నిర్మాతల నుంచి ప్రశంసలు అందాయి. ఇక అందరికంటే ముందుగానే రాజ్ కందుకూరి అతనితో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ కూడా స్క్రిప్ట్ వినగానే ఒకే చేశాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ టాక్సీ వాలా సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అలాగే సావిత్రి బయోపిక్ మహానటి లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పరశురాం - గీతా ఆర్ట్స్ లో చేస్తోన్న ప్రాజెక్ట్ కూడా దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది.