Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ OPS న‌టుడితో `ది ఫ్యామిలీమ్యాన్` ద‌ర్శ‌క‌ద్వ‌యం!

By:  Tupaki Desk   |   10 Aug 2021 1:30 AM GMT
స్పెష‌ల్ OPS న‌టుడితో `ది ఫ్యామిలీమ్యాన్` ద‌ర్శ‌క‌ద్వ‌యం!
X
ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంఛైజీతో ద‌ర్శ‌క‌ ద్వయం రాజ్ అండ్ డీకే పేర్లు అంత‌ర్జాతీయ స్థాయిలో మార్మోగాయి. అమెజాన్ ప్రైమ్ లో `ది ఫ్యామిలీ మ్యాన్` దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ గా సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2 బంప‌ర్ హిట్ అయ్యాక రాజ్ అండ్ డీకే గురించి మ‌రింత‌గా చ‌ర్చ సాగింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తోనే తెలుగు ఆడియెన్ ఓటీటీల‌కు అల‌వాటు ప‌డ్డారంటే అది ఎంత పెద్ద సెన్సేష‌నో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సిరీస్ లో జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌లు మనోజ్ బాజ్ పేయీ- ప్రియ‌మ‌ణి వంటి స్టార్లు న‌టించారు. సీజ‌న్ 2లో అక్కినేని కోడ‌లు స‌మంత‌కు అద్భుతమైన మైలేజ్ ని ఇచ్చే అవ‌కాశాన్ని క‌ల్పించారు ఈ ద‌ర్శ‌క‌ద్వ‌యం. ఇప్పుడు రాజ్ అండ్ డికె ద్వ‌యం మరో అసాధారణ నటుడితో వెబ్ సిరీస్ కోసం జోడీ క‌డుతున్నారు. తాజాగా ఓ సినిమా సెట్లో పాపుల‌ర్ నటుడు కే.కే మీనన్ తో క‌లిసి క‌నిపించారు. ఈ ఫోటోని అంత‌ర్జాలంలో చూసిన వారంతా ఎవ‌రికి వారు గెస్సింగుల్లో ఉన్నారు. ఈ ముగ్గురు కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే చాలా ఆస‌క్తిక‌ర ప్రాజెక్ట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కే.కే.మీన‌న్ న‌టించిన స్పెష‌ల్ ఓ.పీ.ఎస్ సిరీస్ కూడా ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిన‌దే. ఇది కూడా ది ఫ్యామిలీ మ్యాన్ త‌ర‌హాలోనే తీవ్ర‌వాదం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది.

ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం మ‌రో వెబ్ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్నారు. షాహిద్ కపూర్ - రాశి ఖన్నా- విజయ్ సేతుపతి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది విడుదల కానుంది. రాజ్ అండ్ డీకే నెట్ ఫ్లిక్స్ కోసం మ‌రో భారీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌నున్నార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.