Begin typing your search above and press return to search.

ఫ్యామిలీమ్యాన్ క‌ర్త‌ల నుంచి 'గన్స్ అండ్ గులాబ్స్'

By:  Tupaki Desk   |   1 Feb 2022 3:30 AM GMT
ఫ్యామిలీమ్యాన్ క‌ర్త‌ల నుంచి గన్స్ అండ్ గులాబ్స్
X
ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజీతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప పాపులారిటీని ద‌క్కించుకున్నారు రాజ్ అండ్ డీకే. ఈ తెలుగు కుర్రాళ్ల సత్తా ఎంత అన్న‌ది ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో అర్థ‌మైంది. దేశంలో రూపొందించిన అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటిగా ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంచైజీ సంచ‌ల‌నాలు సృష్టించింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఆ త‌ర్వాత‌ అనేక ఆఫర్ లతో దూసుకుపోతున్నారు. ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల‌ సినిమాలపై కంటే వెబ్ కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. రాజ్ నిడుమోరు - కృష్ణ డికె త‌దుప‌రి నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేయ‌నున్నారు. దీనికి `గన్స్ అండ్ గులాబ్స్` అనే పేరు పెట్టారు.

నెట్ ఫ్లిక్స్ తో పాటు D2R ఫిల్మ్స్ (రాజ్ అండ్ డీకే)లో గన్స్ అండ్ గులాబ్స్ ను నిర్మించనున్నారు. గన్స్ అండ్ గులాబ్స్ అనేది 1990ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్.. వినోదం శృంగారంతో మిళితమైన ఇంట్రెస్టింగ్ క‌థాంశ‌మిది. యంగ్ డైరెక్ట‌ర్స్ గతంలో నెట్ ఫ్లిక్స్ తో సినిమా బండి అనే వెబ్ ఫిల్మ్ ని తెర‌కెక్కించారు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అలాగే వీరు రూపొందించే త‌దుప‌రి సిరీస్ గ‌న్స్ అండ్ గులాబ్స్ లో రాజ్ కుమార్ రావు స‌హా దుల్కర్ సల్మాన్ - ఆదర్శ్ గౌరవ్ ముఖ్య‌ పాత్రలలో కనిపిస్తారని గుస‌గ‌స‌లు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్- రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో రాజ్ అండ్ DK రూపొందించిన సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది.