Begin typing your search above and press return to search.

ఈ టైంలో టికెట్‌ రేట్‌ పెంచడం లాభం కాదు నష్టం

By:  Tupaki Desk   |   8 Jan 2021 5:00 PM IST
ఈ టైంలో టికెట్‌ రేట్‌ పెంచడం లాభం కాదు నష్టం
X
గత ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇన్ని నెలల తర్వాత మళ్లీ సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. పది నెలలు మూతపడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు సంక్రాంతి సందర్బంగా ఓపెన్‌ కాబోతున్నాయి. క్రాక్‌.. అల్లుడు అదుర్స్‌.. మాస్టర్‌.. రెడ్‌ సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్‌ అయితే వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది.

ఒక వైపు థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపేందుకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు టికెట్ల రేట్లను ఇష్టానుసారంగా పెంచుకునేందుకు ఓకే చెప్పాయి. దాంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాల కోసం థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు సిద్దం అవుతున్నాయి. క్రాక్‌ సినిమాతో పాటు అన్ని సినిమాల టికెట్ల రేట్లు 200 నుండి 300 వరకు పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ల రేట్లను పెంచడం వల్ల సాదారణంగా లాభం ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో టికెట్ల రేట్లను పెంచడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భయం భయంగా సినిమాకు వెళ్లాలా అంటూ కొందరు ఆలోచిస్తారు. ఇక వారు టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల అవసరం లేదు అనుకునే అవకాశం ఉంది. కనుక ఈ టైమ్‌ లో టికెట్‌ రేటు పెంచడం నష్టం కు దారి తీయవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు