Begin typing your search above and press return to search.

నెట్ ప్లిక్స్ ని పైకి లేపుతోన్న సౌత్ కంటెంట్!

By:  Tupaki Desk   |   21 July 2022 3:30 AM GMT
నెట్ ప్లిక్స్ ని పైకి లేపుతోన్న సౌత్ కంటెంట్!
X
డిజిట‌ల్ స్ర్టీమింగ్ దిగ్జజం నెట్ ప్లిక్స్ ఇండియాలో ఆశించిన స్థాయిలో రాణించ‌ని మాట వాస్త‌వం. అమెజాన్ ప్రైమ్ త‌ర‌హాలో భార‌తీయ మార్కెట్ లో నెట్ ప్లిక్స్ నిలబ‌డ‌లేక‌పోతుంది. ప్రైమ్ కి ధీటుగా ప్లిక్స్  కంటెంట్ ని విక్ర‌యిస్తున్నా...ఆధిప‌త్య పోరులో అంతిమంగా ప్రైమ్ దే  పై చేయి అవుతుంది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో దాదాపు 1 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది  నెట్‌ఫ్లిక్స్. మొత్తం 221 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి  ఉండ‌గా నెట్ ప్లిక్స్ జూన్ వరకు రెండవ త్రైమాసికంలో 9,70,000 మంది సభ్యులను కోల్పోయింది. గత దశాబ్దంలోనే  స్ట్రీమింగ్ దిగ్గ‌జానికి  ఇది అత్యధిక నష్టంగా ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.

అయితే ఇప్పుడీ స‌మీకర‌ణాల్లో మార్ప‌లొస్తున్నాయి. ప్రైమ్ కి పోటీగా నెట్ ప్లీక్స్ ధీటైన సౌత్  కంటెంట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణ‌మంగా చెప్పొచ్చు. ఇంత‌కాలం నెట్ ప్లిక్స్  వ‌రల్డ్ వైడ్ ఎంతో ఫేమ‌స్ అయినా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ స‌హా కొన్ని ఓటీటీ కంపెనీల పోటీని  త‌ట్టుకోలేక పోయింది. ఆమెజాన్ కి పోటీగా చేసిన ప్ర‌తీ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. కోట్ల రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేసిన కంటెంట్ వృద్ధా  అయిపోవ‌డం త‌ప్ప రూపాయి లాభం తీసుకొచ్చింది లేదు.

కానీ నెట్ ప్లిక్స్  ఇప్పుడిప్పుడే ప్రైమ్ త‌ర‌హాలో  సౌత్ మార్కెట్ స్ర్టాట‌జీని అనుస‌రిస్తూ స‌త్ఫ‌లితాల దిశ‌గా అడుగులు వేస్తోంది. పాన్ ఇండియా చిత్రం  `ఆర్ ఆర్ ఆర్`  హిందీ వెర్ష‌న్ రైట్స్ ద‌క్కించుకోవ‌డ‌మే నెట్ ప్లిక్స్ కి వ‌రంగా మారిందని చెప్పొచ్చు. నాలుగు భాష‌ల హ‌క్కులు కొనుగోలు చేసిన జీ-5 ని సైతం వెన‌క్కి నెట్టే ముందు వ‌రుస‌లో నిలిచింది. `ఆర్ ఆర్ ఆర్` కి  గ్లోబ‌ల్ స్థాయిలో గుర్తింపు రావ‌డంతో నెట్ ప్లిక్స్ మెరుగైన ప‌లితాల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదేమూవ్ మెంట్ లో నెట్ ప్లిక్స్ లో రిలీజ్ చేసిన మ‌రికొన్ని తెలుగు సినిమాలు మంచి  ఫ‌లితాలు సాధించాయి. `మేజ‌ర్` సినిమా  తెలుగు..హిందీ రెండు వారాల‌కు పైగానే టాప్ వ‌న్ ట్రెండ్ లో నిలిచింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `అంటే సుంద‌రానికీ` కూడా మాలీవుడ్ లో రికార్డు  వ్యూస్ సాధించింది. `విరాట ప‌ర్వం` థియేట్రిక‌ల్ గా అంత రీచ్ కాన‌ప్ప‌టికీ నెట్ ప్లిక్స్ లో  కోట్ల మంది  వీక్షిస్తున్నారు.

ఈ శుక్ర‌వారం `ఎఫ్‌-3` రేసులోకి వ‌స్తుంది. ఇది ఇప్ప‌టికే హిట్ కంటెట్. థియేట‌ర్లో చూడ‌ని ప్రేక్ష‌కుడు  క‌చ్చితంగా నెట ప్లిక్స్ లో చూస్తాడు. కాబట్టి  నెట్ ప్లిక్స్ అందులో సందేహ ప‌డే ప‌నిలేదు. ఇలా  ఈ సినిమాల‌న్ని నెట్ ప్లిక్స్ ని ఇండియాలో అందులోనూ సౌత్ మార్కెట్ లో  ఒక్క‌సారిగా అలా పైకి లేపుతున్నాయ‌ని  చెప్పొచ్చు.  ఇప్పుడిదే ఫామ్ ని కొనసాగించ‌డానికి కొత్త ర‌క‌మైన స్ర్టాట‌జీతో నిర్వాహ‌కులు ముందుకు క‌ద‌లుతున్నారు.

విక్ర‌యించే కంటెంట్ విష‌యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుని ముందుకు వెళ్లాల‌ని..వీక్ష‌కుల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ద‌క్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా వైడ్ ద‌క్కుతోన్న క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేలా మెజార్టీ పార్ట్ సౌత్ కంటెంట్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందులోనూ తెలుగు కంటెంట్ పై ప్ర‌త్యేకంగా  దృష్టిసారిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప్లానింగ్ ప‌క్కాగా ఉంటే కోల్పోయిన నెంబ‌ర్ ని తిరిగిపొంద‌డం పెద్ద విష‌యమేమి కాదు..