Begin typing your search above and press return to search.

బాలయ్యను వెంటాడుతున్న వరుణుడు

By:  Tupaki Desk   |   16 Aug 2015 6:05 AM GMT
బాలయ్యను వెంటాడుతున్న వరుణుడు
X
బాలకృష్ణ ప్రస్తుతం 99వ సినిమాలో నటిస్తున్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ డిక్టేటర్‌. టైటిల్‌ కి తగ్గట్టే పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. సేమ్‌ టైమ్‌ ఈ సినిమాలో కథా పరంగా ట్రెడిషన్‌ కి పెద్ద పీట వేశారని సమాచారం. ముఖ్యంగా వినాయక చవితి సంబరాల్ని అంబరాన్ని తాకేలా చేసుకునే ఓ కీలకమైన పాట సినిమాకే హైలైట్‌ గా ఉంటుంది. ఈ పాటను ఇప్పటికే హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ చేస్తున్నారు.

సినిమా కార్మికులంతా నివాసం ఉండే చిత్రపురి కాలనీలో భారీ సెట్‌ వేసి షూటింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ 30 అడుగుల ఎత్తు ఉండే ఓ భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి కాలనీ అంతా డెకరేట్‌ చేశారు. ఓ ఐదు రోజుల పాటు సాంగ్‌ చిత్రీకరణకు రెడీ అయ్యారు. ఒకరోజు షూటింగ్‌ పూర్తయింది. ఇంతలోనే వినాయకుడి పుణ్యమా అని వరుణుడు కాస్తా దిగి వచ్చాడు. ఆకాశం మేఘావృతమై షూటింగుకి అడ్డు తగిలాడు. మిగతా నాలుగురోజుల షూటింగ్‌ పోస్ట్‌ పోన్‌ చేయాల్సొచ్చింది.

ఇకపోతే ఇవాళ (ఆదివారం) నుండి తిరిగి షూట్‌ చేయాలనుకున్నా కుదరలేదు. ఇప్పటికీ మబ్బు వాతావరణం, చినుకులు పడుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ సన్నివేశంలో తెలంగాణ రాష్ట్రానికి వరుణుడిని రప్పించే బాధ్యత డిక్టేటర్‌ తీసుకున్నాడనే అనుకోవాలి.