Begin typing your search above and press return to search.

శ్రుతి హాసన్‌ సేఫ్‌ అయిపోయింది

By:  Tupaki Desk   |   17 March 2015 10:48 AM GMT
శ్రుతి హాసన్‌ సేఫ్‌ అయిపోయింది
X
సినిమాల్లో అడుగుపెట్టాక అఫైర్‌ అనే మాట సర్వ సాధారణం. హీరోయిన్లు అఫైర్లు నడపడం ఎంత సహజమో... ఫలానా హీరోయిన్‌కు ఫలానా వ్యక్తితో అఫైర్‌ అంట అని వార్తలు రావడమూ అంతే సహజం. కమల్‌ హాసన్‌ కూతురు శ్రుతి హాసన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొదట్లో కమల్‌ కూతురు కదా అని కొంచెం గౌరవించారు కానీ.. అమ్మడు అందరు హీరోయిన్ల లాగే వీరలెవెల్లో ఎక్స్‌పోజింగ్‌ చేసి.. అన్ని విషయాలూ ఓపెన్‌గా మాట్లాడేయడంతో రూమర్‌ రాయుళ్లు కూడా రెచ్చిపోయారు. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనాతో శ్రుతికి లింకు పెట్టేశారు.

చెన్నైలో రైనా ఆడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు శ్రుతి హాజరై సందడి చేయడంతో వాళ్లిద్దరి మధ్య వీరలెవెల్లో రొమాన్స్‌ నడుస్తోందంటూ కథలు అల్లేశారు. రైనా శ్రుతిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు వార్తలొచ్చేశాయి. ఐతే ఇక ఈ కథనాలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేయాల్సిన రోజు వచ్చేసింది. ఎందుకంటే రైనాకు త్వరలోనే పెళ్లయిపోతోంది. ప్రపంచకప్‌ ముగించుకుని రాగానే రైనాకు పెళ్లి చేసేయడానికి సన్నాహాలు పూర్తి చేసేశారు కుటుంబ సభ్యులు. ఇంకా డేటు ఫిక్స్‌ కాలేదు కానీ.. ఏప్రిల్‌ నెల మధ్యలో పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. తన తల్లి స్నేహితురాలి కూతుర్నే రైనా పెళ్లాడబోతున్నాడట. శ్రుతి సంగతేమో కానీ.. మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కూతురు పూర్ణ పటేల్‌తో రైనా చెట్టాపట్టాలేసుకు తిరిగిన మాట మాత్రం వాస్తవం. వాళ్లిద్దరరూ పెళ్లి చేసుకుంటారని కూడా అనుకున్నారు కానీ.. ఎందుకో ఆ అమ్మాయికి గుడ్‌బై చెప్పేసి తన తల్లి చెప్పి అమ్మాయిని పెళ్లాడుతున్నాడు రైనా. ఏదేమైనా రైనా పెళ్లి వార్తతో శ్రుతి హమ్మయ్య అనుకోవడం ఖాయం.