Begin typing your search above and press return to search.

వార్న‌ర్ త‌ర్వాత రైనా.. శ్రీ‌వ‌ల్లీ సాంగ్ కి సిగ్నేచ‌ర్ స్టెప్

By:  Tupaki Desk   |   23 Jan 2022 9:30 AM GMT
వార్న‌ర్ త‌ర్వాత రైనా.. శ్రీ‌వ‌ల్లీ సాంగ్ కి సిగ్నేచ‌ర్ స్టెప్
X
`పుష్ప - ది రైజ్` జాతీయ స్థాయిలో డిబేట్ కి కార‌ణ‌మ‌వుతోంది. ఈ సినిమా క‌రోనా క్రైసిస్ లోనూ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో హిందీ చిత్ర‌సీమ‌లో బ‌న్ని పేరు మార్మోగుతోంది. కేవ‌లం హిందీ నుంచే 75కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇది ఈ క్రైసిస్ లో అసాధార‌ణ విజ‌యం. ఓటీటీలోనూ గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న డ్యాన్సులు ర‌గ్గ్ డ్ లుక్ ప్ర‌తిదీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా శ్రీ‌వ‌ల్లీ పాట‌లో బ‌న్ని సిగ్నేచ‌ర్ స్టెప్ కి గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇటు సినీతార‌లే కాకుండా అటు క్రికెట‌ర్లు కూడా ఈ సిగ్నేచ‌ర్ స్టెప్ ని అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తూ బోలెడంత ఫ‌న్ ని క్రియేట్ చేస్తున్నారు.

ఇంత‌కుముందే బ‌న్ని వీరాభిమాని ఐపీఎల్ లో ఆడుతున్న ప్ర‌ముఖ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ శ్రీ‌వ‌ల్లీ సాంగ్ లో సిగ్నేచ‌ర్ స్టెప్ ని ఇమ్మిటేట్ చేసిన వీడియో వైర‌ల్ గా మారింది. పుష్పలోని శ్రీవల్లి పాటకు సురేష్ రైనా- రాహుల్ చాహర్ హుక్స్‌స్టెప్ చేశారు. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ తో కలిసి సూపర్ హిట్ పాట కు డ్యాన్స్ చేశాడు.

భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఇప్పుడు `శ్రీవల్లి` పాటకు డ్యాన్స్ చేశాడు. అతను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశాడు. అభిమానులకు ఇది నచ్చింది. రైనా స్ట్రెయిట్ డ్రైవ్ తో ముగించడంతో చివర్లో డ్యాన్స్ కి క్రికెట్ టచ్ ఇచ్చాడు. అతను అల్లు అర్జున్ త‌రహాలోనే త‌గ్గేదేలే! అంటూ గొప్ప ఆహార్యంతో అనుకరించాడు. పాటలో ప్రదర్శన చేస్తున్నప్పుడు అతని కుడి స్లిప్పర్ ను వ‌దిలేయ‌డం కూడా బోలెడంత ఫ‌న్ ని క్రియేట్ చేసింది.

``నేను దీన్ని ఆపలేకపోయాను.. కానీ ప్రయత్నించాను. @alluarjunonline #పుష్ప పాత్ర‌లో అద్భుతమైన ప్రదర్శన క‌న‌బ‌రిచారు. మీరు చాలా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను!``` అని భారత మాజీ క్రికెటర్ రైనా వ్యాఖ్య‌ను జోడించారు. 22 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా ట్రెండ్ లో చేరి సూపర్ హిట్ పాటకు డ్యాన్స్ చేశాడు. జస్ట్ బీయింగ్ ఫ్యాన్‌బాయ్ @alluarjunonline #pushpa #srivalli అని బ‌న్నీకి ట్యాగ్ చేస్తూ రాశాడు.

అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప: ది రైజ్ వీడియోలు ఎంతో క్రేజీగా సోషల్ మీడియా సందడి చేస్తున్నాయి. తెలుగు భాషలో ఈ యాక్షన్ డ్రామాకు పార్ట్ -1 గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలైంది.