Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్: కొత్త వాళ్లకు తప్పదు

By:  Tupaki Desk   |   1 Aug 2018 4:24 PM IST
కాస్టింగ్ కౌచ్: కొత్త వాళ్లకు తప్పదు
X
సినిమా లేడీ సెలెబ్రెటీలు ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు .. మీడియా ప్రతినిధులు అడిగే మొదటి ప్రశ్న కాస్టింగ్ కౌచ్ గురించే.. ఈ మధ్య హీరోయిన్ రాయి లక్ష్మీకి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె సంచలన విషయాలను చెప్పుకొచ్చింది.

రాయ్ లక్ష్మీ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను విలేకరులకు వివరించింది. ‘‘కాస్టింగ్ కౌచ్ అనేది కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లకు ఎదురయ్యే మొదటి సమస్య. కొత్త వారికి అవకాశాల పేరుతో అశ చూపి లొంగదీసుకుంటున్నారు. అది ఇవ్వడమా..? లేక సినిమా వదలుకోవడమా అన్న రీతిలో వ్యవహరిస్తుండడంతో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది’’. అని తెలిపింది.

అయితే కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు కూడా మొదట్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని.. కానీ ఏనాడు వాటికి లొంగిపోలేదని రాయ్ లక్ష్మీ వివరణ ఇచ్చింది. ఇక శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందించమని రాయ్ లక్ష్మీని కోరగా.. ‘మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆమె ఎలుగెత్తి చాటుతోంది. ఆమె ఒక బాధితురాలు కావడంతో ఇండస్ట్రీలోని దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తోంది’ అంటూ వివరణ ఇచ్చింది.