Begin typing your search above and press return to search.

ఆరుబ‌య‌ట మెట్ల‌పై ఆర‌బోసిన‌ ర‌త్తాలు

By:  Tupaki Desk   |   9 July 2021 7:30 AM GMT
ఆరుబ‌య‌ట మెట్ల‌పై ఆర‌బోసిన‌ ర‌త్తాలు
X
ఓవైపు లాక్ డౌన్ తో అట్టుడికిపోతుంటే మ‌రోవైపు వ‌రుస ఫోటోషూట్ల‌తో అల్లాడించింది రాయ్ ల‌క్ష్మీ. క‌ష్ట‌కాలంలో విమ‌ర్శ‌లు సూటి పోటి మాట‌ల తూటాలు త‌న‌పైనే నెటిజ‌నం రువ్వుతున్నా అవేవీ ప‌ట్టించుకోకుండా బ‌ర్త్ డే పార్టీలు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ అంటూ వేడెక్కించింది.

అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలోనూ త‌న ఫోటోషూట్ల పిచ్చి వ‌దిలిపోయిన‌ట్టు లేదు. హీరోలు హీరోయిన్లు అంతా ఎవ‌రికి వారు పెండింగ్ షూట్లు అంటూ ప‌రిగెడుతుంటే రాయ్ ల‌క్ష్మీకి అదేమీ ప‌ట్టిన‌ట్టు లేదు. ఇంకా ఫోటోషూట్ల మాయ‌లోనే ఉండిపోతోంది.

తాజాగా రత్తాలు అలియాస్ రాయ్ ల‌క్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో మైండ్ బ్లాక్ చేసింది. అలా ఆరుబ‌య‌ట మెట్ల‌పై ఆర‌బోసింది ర‌త్తాలు.. ఆద‌మ‌రిచి అలా కెమెరాకు ఫోజులిచ్చింది. బ్లూటాప్ కాంబినేష‌న్ బ్లూ క‌ళ్ల‌ద్దం ధ‌రించిన ఈ బ్యూటీ బాట‌మ్ లో ఫ్లోర‌ల్ డిజైన్ ఫ్రాక్ తో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ టెంప్టింగ్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. రాయ్ లక్ష్మి బ్యాక్ టు బ్యాక్ నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ ఉంది. కానీ లాక్ డౌన్ అనంత‌రం ఇంకా షూటింగులు ప్రారంభ‌మైన‌ట్టు క‌నిపించ‌డం లేదు. అందుకే ఇలా తీరిక స‌మ‌యాల్ని సద్వినియోగం చేస్తోంద‌న్న‌మాట‌.