Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : తెల్ల బికినీలో హాట్ అందాలు

By:  Tupaki Desk   |   2 Sep 2021 1:30 AM GMT
ఫొటోటాక్ : తెల్ల బికినీలో హాట్ అందాలు
X
తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో 2005 లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ ఆ తర్వాత తర్వాత రాయ్ లక్ష్మీగా మారింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పటికి కూడా బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లో మంచి గుర్తింపుతో దూసుకు పోతుంది. పలు భాషల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా ప్రత్యేక పాటలు చేయడం.. ప్రత్యేక పాత్రలతో అలరించడంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ఇప్పటికి కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో తో ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తెల్లటి బికినీలో ఈమె అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఇంత అంతగత్తెకు స్టార్‌ హీరోయిన్ గా పేరు రాకపోవడం దారుణం.. విచారకరం అంటూ ఈ ఫొటోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి అయినా రాయ్‌ లక్ష్మికి స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు రావాలని పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో ఈమె చేస్తున్న ఫొటోలు ఆమెను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తున్నాయని అంటున్నారు.

రాయ్‌ లక్ష్మి ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపై కూడా తనదైన శైలిలో మెప్పిస్తూ వచ్చింది. ఇక ఈమెకు ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నాయట. మొత్తానికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్‌ ఆరంభం నుండి ఒక స్థాయిలో ఈమె సినిమాలు చేస్తూ వస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఖాళీగా అయితే లేదు. ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూ కెరీర్‌ లో అలా అలా ముందుకు సాగుతూనే ఉంది.