Begin typing your search above and press return to search.

రాహుల్ విజయ్.. మేఘ ఆకాష్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ

By:  Tupaki Desk   |   22 March 2022 10:41 AM GMT
రాహుల్ విజయ్.. మేఘ ఆకాష్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
X
యువ హీరో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో చిత్రం ప్రారంభమైంది. తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తూ ఉండటం విశేషం. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించారు. అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్బంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్లీ వీరితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కావున నాకు చాలా స్పెషల్ గా భావిస్తున్నాను అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. మా కొత్త చిత్రాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ మూవీ ఇది. కూల్ రోమ్ కామ్ గా ఆకట్టుకుంటుంది. ప్యాషనేట్ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా మీ అందరిని మెప్పించే విధంగా ఉంటుంది. సినిమాకు మాకు మీ ఆశీర్వాదాలు కావాలన్నాడు.

మరో నటుడు అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ … ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు. నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ ఇద్దరు కూడా మంచి ప్రతిభ ఉన్న వారు. సినిమాలో ఖచ్చితంగా ఇద్దరి కూడా బెస్ట్ యాక్టింగ్ చూస్తారు. అలాగే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా. హైదరాబాద్ లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. మొత్తం 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుందన్నారు.

దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ.. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ గా కథనం ఉండేలా తెరకెక్కించబోతున్నాం. హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీ నటులకు మంచి అవకాశం ఉంటుంది.

సినిమా బాగా వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. మరో నిర్మాత అభిషేక్ కోట మాట్లాడుతూ.. మా కోట ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ లో ప్రొడక్షన్ వన్ గా ఈ చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.