Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: పున‌ర్న‌వికి ప్ర‌పోజ్ చేసేశాడుగా..

By:  Tupaki Desk   |   7 Sep 2019 6:30 AM GMT
బిగ్‌ బాస్‌: పున‌ర్న‌వికి ప్ర‌పోజ్ చేసేశాడుగా..
X
బిగ్‌ బాస్‌ హౌస్‌లో స‌ర‌దాలు - ఎమోష‌న్లు - ఏడుపులు - గొడ‌వ‌లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. శుక్ర‌వారం ఎపిసోడ్‌ లో చివర్లో పునర్నవి - రాహుల్‌ - వితికా - వరుణ్‌ మాట్లాడుకోవడం హైలెట్‌ గా నిలిచింది. ఇక అంత‌కు ముందు హౌస్‌ లో అంద‌రి కుటుంబ స‌భ్యులు పంపిన ఉత్త‌రాలు ఎవ‌రికి వారు చ‌దివి వినిపించారు. అలాగే వాళ్ల ఫ్యామిలీ నుంచి వారికి ఇష్ట‌మైన వంట‌కాలు కూడా వ‌చ్చాయి. ఇక కొద్ది రోజులుగా హౌస్‌ లో రాహుల్‌ - పున‌ర్న‌వి గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి.

రాహుల్‌ ను జైళ్లో పెట్టిన‌ప్పుడు కూడా పున‌ర్న‌వి జైలు ద‌గ్గ‌రే జాగారం చేసింది. ఇక ఇసుక వేసే కెప్టెన్సీ టాస్క్‌ లో రాహుల్ కోసం చేయాల్సిందంతా చేసింది. ఇక శుక్ర‌వారం ఎపిసోడ్ చివ‌ర్లో పునర్నవి మీద ఎలాంటి ఫీలింగ్‌ లేదా అంటూ రాహుల్‌ ను వితికా ప్రశ్నించింది. ఆమెపై కొంచెం కూడా ప్రేమ‌లేదా ? అంటూ మ‌రోసారి రెట్టిస్తూ ప్ర‌శ్నించింది.

రాహుల్ మాట్లాడుతూ తనకు ఇష్టమైతే నేరుగా వెళ్లి పునర్నవిని అడుగుతానని - ప్రపోజ్‌ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక వ‌రుణ్ ఇదే అంశంపై పున‌ర్న‌విని ప్ర‌శ్నించాడు. రాహుల్ అంటే ఇష్ట‌మేనా అని అడ‌గ‌గా పున‌ర్న‌వి రాహుల్ అంటే ఇష్టం ఉన్నా... ప్రేమ లేదని చెబుతూ ఉండగా.. మధ్యలో కలగజేసుకుని ‘ఐ లవ్యూ నవి’ అంటూ రాహుల్‌ ప్రపోజ్‌ చేశాడు.

వెంట‌నే వ‌రుణ్‌ - వితిక‌తో పాటు పున‌ర్న‌వి కూడా షాక్ అయ్యారు. వెంట‌నే రాహుల్ జ‌స్ట్ సరదాగా అన్నానంటూ రాహుల్‌ మళ్లీ కవర్‌ చేసేశాడు. ఏదేమైనా రోజు రోజుకు పున‌ర్న‌వి - రాహుల్ క‌థ రోజు రోజుకు చాలా దూరం వెళుతోంది.