Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 3' విజేత బెంజ్ కార్ బాప్ రే

By:  Tupaki Desk   |   5 Jan 2020 7:25 AM GMT
బిగ్ బాస్ 3 విజేత బెంజ్ కార్ బాప్ రే
X
కింగ్ నాగార్జున హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ 3 బిగ్ స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ విన్న‌ర్ గా సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ అంద‌రి మ‌నసులు దోచాడు. ఫైన‌ల్లో యాంక‌ర్ కం నటి శ్రీ‌ముఖిని వెన‌క్కి నెట్టి విజేత‌గా నిలిచిన రాహుల్ రూ.50ల‌క్ష‌లు గెలుచుకున్నాడు. అయితే తాను విజేత‌ను అయితే పేరెంట్స్ కి సొంతంగా ఓ అపార్ట్ మెంట్ కొని కానుక ఇస్తాన‌ని అన్నాడు.

అయితే సొంత అపార్ట్ మెంట్ కానుకిచ్చాడో లేదో కానీ తాను మాత్రం బెంజ్ కార్ కొన్నాడు. బంజారాహిల్స్ బెంజ్ షో రూమ్ నుంచి ఈ కార్ ని కొనుక్కున్నాడు రాహుల్. మెర్సిడెస్ బెంజ్ కార్ అంటే మినిమం రేంజు 30ల‌క్ష‌ల నుంచి కోటి పైగానే ఉంది. అంత‌టి ఖ‌రీదైన కార్ కొన్నాడంటే బిగ్ బాస్ చెక్ తో పాటుగా గెలుపు అనంత‌రం ఆ క్రేజుతో ర‌క‌ర‌కాల ఈవెంట్ల‌తో బిజీ అయ్యి భారీగానే ప్యాకేజ్ లు అందుకున్నాడ‌న్న చ‌ర్చా అభిమానుల్లో సాగుతోంది. బిగ్ బాస్ విజేత‌గా అత‌డికి జ‌నాల్లో ఉన్న క్రేజు క‌మ‌ర్షియ‌ల్ గానూ వ‌ర్క‌వుట‌వుతోంద‌ట‌.

ఇక రాహుల్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదంతా స‌రే కానీ.. బిగ్ బాస్ పార్టిసిపెంట్ కాక‌పోయినా అత‌డి కొలీగ్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ వెంగి ఇటీవ‌లే బ్రెజ్జా బ్రాండ్ రెడ్ కార్ కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే. ``రాహుల్ కి తొలిగా త‌న తండ్రి గారు ఓ స్విఫ్ట్ కార్ ని కొనిచ్చారు. ఇప్పుడు త‌న క‌ష్టంతో బెంజ్ కార్ కొన‌డం ఆనందాన్నిచ్చింది. ప్ర‌తిభ‌కు ద‌క్కిన గౌర‌వ‌మిది`` అని వెంగీ సుధాక‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక కెరీర్ ఆరంభం రాహుల్ ని ఎం.ఎం.కీర‌వాణికి ప‌రిచ‌యం చేసిన‌ది వెంగీనే అన్న టాక్ మీడియాలో ఉంది.