Begin typing your search above and press return to search.

డైరక్షన్ లోకి యంగ్ హీరో?

By:  Tupaki Desk   |   2 Sep 2017 2:34 PM GMT
డైరక్షన్ లోకి యంగ్ హీరో?
X
ఎదో ఒక టాలెంట్ తో వెండి తెరపై స్టార్ గా ఎదగాలని చాలా మంది వస్తుంటారు. అయితే ఒక్కోసారి వారు సినిమా ఫీల్డ్ లో ఎంచుకున్న వృత్తి సడన్ గా మారిపోయి వేరొక వృత్తిలోకి మారిపోతారు. ఉదాహరణకు దర్శకుడిగా నిరూపించుకోవాలని వచ్చిన చాలామంది నటులుగా హీరోలుగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే తరహాలో ఒక నటుడు వెరైటీగా దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత శ్రీమంతుడు - టైగర్ - అలా ఎలా.. సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2014లో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో ఫెమస్ అయిన చిన్మయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇపుడు ఈ హీరో సుశాంత్ ని మెయిన్ లీడ్ లో ఉంచి ఒక కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నాడట.

మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చినా రాహుల్ కి చిన్నప్పటి నుండే దర్శకత్వంపై చాలా మక్కువ ఉందట. దీంతో మొదటి సినిమాను ఫైనల్ గా తియ్యడానికి రెడీ అయిపోయాడు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే చిత్ర నటీనటులు, చిత్ర యునిట్ సభ్యుల వివరాలను గురించి త్వరలో ఈ యువ హీరో తెలియజేస్తాడట.