Begin typing your search above and press return to search.

నా పేరు మహేష్‌ సూచించారు -రాహుల్‌

By:  Tupaki Desk   |   23 Jun 2015 7:30 PM GMT
నా పేరు మహేష్‌ సూచించారు -రాహుల్‌
X
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు రాహుల్‌ రవీంద్రన్‌. తొలిసినిమాతోనే పెర్ఫామర్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తనవైపు వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా నటిస్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్‌ నటుడిగా రాణిస్తున్నాడు. సెకండ్‌ లీడ్‌ అన్న చిన్నచూపు చూడకుండా, ఈగోకి పోకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఇటీవలే అలా ఎలా చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ టైగర్‌లో కీలకపాత్రలో నటించాడు. ఈనెల 26న టైగర్‌ రిలీజవుతోంది. ఈ సందర్భంగా పలు విషయాలపై ముచ్చటిస్తూ.. సందీప్‌ చాలా కాలంగా స్నేహితుడు. తనతో కలిసి నటించడం చాలా బావుంది. టైగర్‌లో కీలకమైన పాత్ర నాది. అలాగే హైదరాబాద్‌ లవ్‌స్టోరి అనే చిత్రంలో నటించాను. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్‌కి వస్తోంది.

వీటన్నిటికంటే నా ఫేవరెట్‌ హీరో మహేష్‌ నటిస్తున్న 'శ్రీమంతుడు'లో ఓ ఆసక్తికరమైన పాత్రలో నటించాను. వాస్తవానికి నాకు ఆ అవకాశం రావడానికి కారణం మహేష్‌. తనే నా పేరును సూచించారు అని తెలియగానే చాలా సంతోషం అనిపించింది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అవకాశమిది.. అంటూ తాజా ప్రాజెక్టుల గురించి వివరించాడు రాహుల్‌.