Begin typing your search above and press return to search.

జీఏ-2లో యంగ్ మేక‌ర్ లేడీ ఓరియేంటెడ్!

By:  Tupaki Desk   |   12 Jun 2022 6:30 AM GMT
జీఏ-2లో యంగ్ మేక‌ర్ లేడీ ఓరియేంటెడ్!
X
గీతా ఆర్స్ట్ కి అనుబంధంగా ఏర్పాటైన జీఏ-2 బ్యాన‌ర్ కూడా స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగ‌తి  తెలిసిందే. సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో పాటు న‌వ‌త‌రం మేక‌ర్స్ తోనూ జీఏ2  బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ జీఏ2 లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` దగ్గ‌ర నుంచి `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` వ‌ర‌కూ స‌క్సెస్ లు స‌ద‌రు బ్యాన‌ర్లో ఉన్నాయి.

`గీత‌గోవిందం`..`టాక్సీవాలా`..`ప్రతీరోజు పండగే` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌తో బ్యాన‌ర్ ముందంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్`...`18 పేజీస్` చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో  ఒక‌టి క‌మ‌ర్శియల్ చిత్రం  కాగా..మ‌రొక‌టి డిఫ‌రెంట్ జానర్.  తాజాగా జీఏ2 మ‌రో కొత్త ప్రయ‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని నిర్మించ‌డానికి జీఏ2 రెడీ అవుతోందిట‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ లేడీ ఓ రియేంటెడ్ చిత్రం ఉంటుంద‌ని సమాచారం. ఈ చిత్రానికి యంగ్ మేక‌ర్ రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారుట‌. ఇటీవ‌లే రాహుల్ స‌ద‌రు బ్యాన‌ర్ కి ఈ స్ర్కిప్ట్ వినిపించి లాక్ చేసిన‌ట్లు గుస‌గుస వినిపిస్తుంది. స్ర్కిప్ట్ న‌చ్చ‌డంతో మరో ఆలోచ‌న లేకుండా ఒకే చేసినట్లు తెలుస్తోంది.

మేక‌ర్ గా రాహుల్ స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  `చిల‌సౌ` సినిమాతో ట్యాలెంటెడ్ మేక‌ర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు.  త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సైతం త‌నలో దాగిన హిడెన్ ట్యాలెంట్ ని ఇప్పుడిప్పుడే బ య‌ట‌కు తెస్తున్నాడ‌ని ప్ర‌శంసించాడు. త‌న‌లో ఆ ప్ర‌తిభ గుర్తించే కింగ్ నాగార్జున `మ‌న్మ‌ధుడు-2` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఆ సినిమా కూడా యావ‌రేజ్ గా ఆడింది. `మన్మ‌ధుడు` అంత పెద్ద హిట్ కాక‌పోయినా ఆ సినిమా స్థాయిని మాత్రం త‌గ్గించ‌లేదు. ఇలా స‌క్సెస్  ట్రాక్ రికార్డు   ఉన్న రాహుల్ కి జీఏ2  బ్యాన‌ర్ ఇప్పుడు  పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రాహుల్ అంత‌కు ముందు హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరో అవ్వాల‌ని ఎంట్రీ ఇచ్చాడు.

కానీ హీరోగా అత‌ని కెరీర్  సాపీగా సాగ‌లేదు. దీంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకున్నాడు. అక్కడా న‌టుడిగా అంత బిజీ కాలేదు. న‌టుడిగా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూనే ద‌ర్శ‌కుడిగానూ  ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి స‌క్సెస్ అయ్యాడు.  త‌న లో దాగిన మ‌రో ప్ర‌తిభ‌ని బ‌య‌ట‌కు తెచ్చాడు. ఇప్పుడా  ట్యాలెంట్ అత‌న్ని ప‌రిశ్ర‌మ‌లో బిజీగా మ‌లుస్తుంది.