Begin typing your search above and press return to search.

విడాకుల లాయర్ కి మూడో భామ దొరకలే

By:  Tupaki Desk   |   9 July 2016 5:15 AM GMT
విడాకుల లాయర్ కి మూడో భామ దొరకలే
X
కొన్నేళ్లపాటు తమిళ్ లో తెగ ప్రయత్నాలు చేసిన రాహుల్ రవీంద్రన్ కు.. తెలుగులో అందాల రాక్షసి మూవీతో గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఆ సినిమా చెప్పుకోదగినంత స్థాయిలో హిట్ కొట్టకపోయినా.. ఈ యాక్టర్ కి మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. అందాల రాక్షసి తర్వాత ఎంతగా ఈ రాహుల్ పాతుకుపోయాడంటే.. గత మూడేళ్లలో ఒక్కటి తప్ప అసలు కోలీవుడ్ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం రాలేదు.

ఇప్పుడీ హీరో ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పై రూపొందుతున్న సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ పేరు శోభన్ బాబు. ఓ దిగ్గజ నటుడి పేరుతో రూపొందుతున్న సినిమా అయినా.. ఇదేమీ బయోపిక్ కాదు. ఇందులో విడాకుల లాయర్ గా ఓ విభిన్నమైన పాత్రను రాహుల్ రవీంద్రన్ పోషిస్తున్నాడు. అయితే.. కేరక్టర్ ప్రకారం ఈ పాత్ర చాలా విచిత్రమైనది. 'నేను విడాకులు ఇప్పించే లాయర్ పాత్ర పోషిస్తున్నాను. కానీ నా పాత్ర ముగ్గురు అమ్మాయిల మధ్య నలుగుతూ ఉంటుంది. వారి మధ్య ఈ పాత్ర ఎలాంటి ఒడ్డుకు చేరిందన్నదే అసలు పాయింట్' అంటున్నాడు రాహుల్ రవీంద్రన్.

టాలీవుడ్ లో ఇలాంటి రోల్స్ ని సిద్ధార్ధ్ ట్రై చేసినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. మరి రాహుల్ రవీంద్రన్ ఏ మేరకు విజంయ సాధిస్తాడని చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. ఈ మూవీ కోసం నిత్యా శెట్టి.. పార్వతీ నాయర్.. లు హీరోయిన్ లు గా సైన్ చేయగా.. మరో భామ కోసం అన్వేషణ జరుగుతోంది.