Begin typing your search above and press return to search.

'మిఠాయి' లొల్లిలో మహేష్‌ బాబు పేరు

By:  Tupaki Desk   |   17 May 2019 8:58 AM GMT
మిఠాయి లొల్లిలో మహేష్‌ బాబు పేరు
X
'అర్జున్‌ రెడ్డి', 'పెళ్లి చూపులు' చిత్రాలతో కమెడియన్స్‌ గా మంచి పేరు దక్కించుకున్న రాహుల్‌ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు హీరోలుగా తెరకెక్కి ఆమద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మిఠాయి'. సినిమా ఫస్ట్‌ లుక్‌ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తప్పకుండా సినిమా సక్సెస్‌ అవుతుందని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూసిన తర్వాత అనిపించింది. ఇద్దరు కమెడియన్స్‌ కడుపుబ్బ నవ్వించడం ఖాయంగా భావించారు. కాని సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక సినిమా విడుదలైన రెండవ రోజే రాహుల్‌ మీడియా ముందుకు వచ్చి మీరు పెట్టుకున్న అంచనాలను రీచ్‌ అవ్వలేక పోయాం ఇకపై ఇలా జరుగకుండా చూసుకుంటా మంచి సినిమాల్లో చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలైన రెండవ రోజే రాహుల్‌ ఈ ప్రకటన చేయడంతో దర్శకుడు ప్రశాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో రాహుల్‌ తీరుపై ప్రశాంత్‌ తీవ్ర విమర్శలు చేశాడు.

'మిఠాయి' లొల్లి పూర్తి అయ్యిందని భావిస్తున్న తరుణంలో మరో సారి ఈ వివాదం మీడియా ముందుకు వచ్చింది. రాహుల్‌ వ్యక్తిత్వం అంత మంచిది కాదంటూ మిఠాయి మూవీ అఫిషియల్‌ ఫేస్‌ బుక్‌ పేజీలో ఏ బిట్టర్‌ మిఠాయి విత్‌ రాహుల్‌ రామకృష్ణ పేరుతో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌ లో రాహుల్‌ రామకృష్ణ పై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ పోస్ట్‌ చేసింది ఎవరో కాని రాహుల్‌ రామకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిఠాయి చిత్రం షూటింగ్‌ సమయంలో ఇంకా పలు సందర్బంలో భరత్‌ అనే నేను చిత్రంలోని నా పాత్రను తగ్గించారు. లేదంటే మహేష్‌ బాబు కంటే ఎక్కువ పేరు నాకు వచ్చేది. మహేష్‌ బాబు నా పాత్ర ముందు చిన్నబోతాడేమో అనే ఉద్దేశ్యంతో నా పాత్రను తగ్గించారు. మహేష్‌ బాబు ప్రత్యేకంగా చెప్పి మరీ నా పాత్రను ట్రిమ్‌ చేయించాడు అంటూ రాహుల్‌ అనేవాడు ఇంకా చాలా మంది వద్ద చెప్పాడు. షూటింగ్‌ సమయంలో కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ ఆ పోస్ట్‌ లో పేర్కొనడం జరిగింది.

ఈ వ్యాఖ్యలతో రాహుల్‌ కెరీర్‌ ప్రమాదంలో పడ్డట్లయ్యింది. మిఠాయి చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో కాని రాహుల్‌ కెరీర్‌ పై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రశాంత్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ తప్పనిసరిగా స్పందించాలి. మరి రాహుల్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.