Begin typing your search above and press return to search.

రాహుల్ రామకృష్ణకు హాలీవుడ్ కాలింగ్

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:21 AM GMT
రాహుల్ రామకృష్ణకు హాలీవుడ్ కాలింగ్
X
'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండకు స్నేహితుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రాహుల్ రామకృష్ణకు మంచి గుర్తింపే సంపాదించుకున్నాడు. కమెడియన్ పాత్రలతో పాటు లీడ్ రోల్స్ కూడా చేస్తున్న రాహుల్ తాజాగా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నానంటూ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.

ప్రదీప్ కాటసాని దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న 'సిల్క్ రోడ్' అనే సినిమాలో రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. దర్శకుడు ప్రదీప్ కు ఇది డెబ్యూ చిత్రం. లాస్ ఎంజెలెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సైబర్ క్రైమ్.. డ్రగ్స్ చుట్టూ తిరుగుతుందట. రాహుల్ అనగానే కామెడీ సినిమా అనుకుంటారేమో.. కాదు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ పోషించేది సీరియస్ పాత్రే. ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు రాహుల్ రామకృష్ణ

ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు పంపే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తారట. ఇండియన్స్ తీసే సినిమా అయినప్పటికీ ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి రాహుల్ కు అల్ ది బెస్ట్ చెబుదాం. మన తెలుగు నటుడు అంతర్జాతీయ స్థాయిలో ఉండే సినిమాలో నటించడం గొప్ప విషయమే కదా.