Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పేస్తున్న స్టార్ క‌మెడియ‌న్..!

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:32 AM GMT
షాకింగ్‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పేస్తున్న స్టార్ క‌మెడియ‌న్..!
X
రాహుల్ రామకృష్ణ.. ఈయ‌న గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అన‌తి కాలంలో స్టార్ క‌మెడియ‌న్‌గా గుర్తింపు పొందిన న‌టుల్లో ఈయ‌న ఒక‌రు.

`జయమ్ము నిశ్చయమ్మురా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామ‌కృష్ణ‌.. సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన `అర్జున్ రెడ్డి` సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్నేహితుడిగా న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాడు.

ఈ మూవీ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలను అందుకున్న రాహుల్‌.. త‌న‌దైన న‌ట‌న‌, కామెడీ టైమింగ్‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవ‌ల విడుద‌లైన `జాతిర‌త్నాలు` సినిమాతో రాహుల్ క్రేజ్ మ‌రింత‌గా పెరిగింద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తతం `ఆర్ఆర్ఆర్‌`తో స‌హా మ‌రిన్ని సినిమాలు చేస్తూ మాంచి జోరు మీద ఉన్న ఈయ‌న‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

తాను సినిమాల‌కు గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అధికారంగా ప్ర‌క‌టించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని, ఈ విష‌యంలో ఎవరేం అనుకున్నా పట్టించుకోనంటూ రాహుల్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టాడు. దీంతో ఒక్క‌సారిగా షాకైన ఆయ‌న అభిమానులు.. రాహుల్ సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌డం వెన‌క కార‌ణం ఏంటా..? అని ఆరాలు తీయడం ప్రారంభించారు.

మ‌రోవైపు నెటిజ‌న్లు మాత్రం ఇదేదో సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే అని అభిప్రాయపడుతున్నారు. మ‌రి రాహుల్ నిజంగా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా..? లేక సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మేనా..? అన్న‌ది తెలియాలి.