Begin typing your search above and press return to search.

టైసన్ కొత్తగా ట్రై చేస్తున్నాడట..

By:  Tupaki Desk   |   6 Dec 2016 4:43 AM GMT
టైసన్ కొత్తగా ట్రై చేస్తున్నాడట..
X
హ్యాపీడేస్- శేఖర్ కమ్ముల తీసిన ఈ మూవీ అందులో యాక్ట్ చేసిన వాళ్లందరికీ ఎక్కడ లేని ఫేమ్ తెచ్చిపెట్టింది. తమన్నా టాప్ హీరోయిన్ అయిపోతే.. వరుణ్.. నిఖిల్ లాంటి వారు హీరోలుగా టర్నింగ్ ఇచ్చుకొన్నారు. ఇక కేరెక్టర్స్ నేమ్ తో పాపులర్ అయ్యారు మిగిలిన వాళ్లు. అలా గుర్తుండిపోయే పేరు టైసన్. అసలు పేరు రాహుల్ కంటే టైసన్ గానే పాపులర్ అయ్యాడు ఈ యాక్టర్. కానీ కెరీర్ పరంగా తీసుకొన్న రాంగ్ స్టెప్స్ రాహుల్ కి బ్రేక్ లు వేశాయ్.

రెయిన్ బో - ముగ్గురు - ప్రేమ ఒక మైకం - లవ్ యూ బంగారం అంటూ సినిమాలు చేసినప్పటికీ.. సిక్స్ ప్యాక్ అంటూ ప్రయోగాలు చేస్తోన్నా రాహుల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కొత్త మూవీ వెంకటాపురంతో తాను గాడిలో పడతానని నమ్మకంగా ఉన్నాడు రాహుల్. 30 స్క్రిప్ట్స్ విన్న తర్వాత వెంకటాపురం మూవీ నచ్చి చేస్తున్నానని.. తన కెరీర్ వెంకటాపురం ముందు.. ఆ తర్వాత అని చెప్పుకుంటారని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు రాహుల్.

ఇక పోస్టర్ మీద డిఫరెంట్ షెడ్స్ లో కనిపించే ఫేస్ తో రిలీజైన వెంకటాపురం ఫస్ట్ లుక్ పోస్టర్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్రిల్లర్ మూవీగా రాబోతున్న వెంకటాపురం మూవీతో వేణు అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. పోస్టరైతే సినిమా మీద అంచనాలు పెంచింది. మూవీలో కంటెంట్ కూడా ఉంటే రాహుల్ కి నిజంగా ఎదురు చూస్తోన్న బ్రేక్ వస్తుందేమో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/