Begin typing your search above and press return to search.

కమ్ముల హీరోలు.. ప్యాకులే ప్యాకులు

By:  Tupaki Desk   |   27 Jun 2016 11:00 PM IST
కమ్ముల హీరోలు.. ప్యాకులే ప్యాకులు
X

హ్యాపీడేస్ మూవీతో దర్శకుడు శేఖర్ కమ్ముల నలుగురు కొత్త కుర్రాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఒక సినిమాతో ఒకరికో ఇద్దరికో గుర్తింపు వస్తుంది. కానీ హ్యాపీడేస్ తర్వాత ఆ సినిమాలోని అందరు కుర్రాళ్లకు మంచి పేరు వచ్చింది. ఆ పాత్రలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే ఒకే సినిమా నుంచి ముగ్గురు హీరోలుగా మారే అరుదైన సందర్భం వచ్చింది.

హ్యాపీడేస్ తో పరిచయమైన వారంతా ఇప్పటికే సిక్స్ ప్యాకుల బాట పట్టేశారు. స్టార్ హీరోల రూట్ లో వెళ్లిపోయి కొత్తదనం కోసం ప్యాకులు చేసేశారు. మొదట వరుణ్ సందేశ్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఎవరైనా ఎపుడైనా అనే మూవీ కోసం ఈ ప్యాకులు చేసి చూపించాడీ హీరో. అయితే సినిమా రిజల్ట్ తేడా రావడంతో గుర్తింపు రాలేదు. మంచి జోష్ మీదున్న నిఖిల్ రీసెంట్ గా శంకరాభరణం కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. తనకు ఈ సినిమా స్టార్ స్టేటస్ ఇస్తుందనే నమ్మకంతో బాగానే కష్టపడ్డాడు కానీ ఫలితం పాజిటివ్ గా రాలేదు.

ఇప్పుడు టైసన్ పాత్రతో ఆకట్టుకున్న బక్క హీరో రాహుల్ హరిదాస్ కూడా సిక్స్ ప్యాక్ చేసేస్తున్నాడు. కొత్త సినిమాలో భారీ కాయంతో కనిపించేందుకు కలరియపట్టు - మల్ల యుద్ధ విద్యలను కూడా నేర్చేసుకున్నాడు రాహుల్. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో పరిచయమైన అభిజీత్ కూడా తన తర్వాతి సినిమా కోసం ఆరు పలకల దేహాన్ని చూపించేశాడు. కమ్ముల హీరోలంతా ఇలా సిక్స్ ప్యాక్ లను నమ్ముకోడానికి కారణం ఏంటో?