Begin typing your search above and press return to search.
జైలులో ఉన్న హీరోయిన్ బాత్ రూమ్ లో జారిపడిందట...!
By: Tupaki Desk | 13 Oct 2020 1:00 PM ISTశాండిల్ వుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రాగిణి ద్వివేది ని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాగిణి కి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీసీబీ ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు హీరోయిన్ సంజన మరియు పలువురు డ్రగ్ పెడ్లర్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరప్పన జైలులో ఉన్న హీరోయిన్స్ ఈ కేసులో మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. మూత్ర పరీక్షల కోసం రాగిణికి ఒక చిన్న సీసా ఇవ్వగా.. అందులో ఆమె మూత్రానికి బదులు నీళ్లు పోసి ఇచ్చిందని కన్నడ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి - సంజన బెయిల్ పిటిషన్లను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.
ఇదిలా ఉండగా పరప్పన జైల్లో ఉన్న రాగిణి ద్వివేది బాత్ రూమ్ లో జారిపడి గాయపడినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కు అనుమతించాలని ఇప్పటికే రాగిణి తరపు న్యాయవాది ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జారిపడటంతో వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని.. జైలు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి కూడా అవకాశం కల్పించాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యంతరాలు ఉంటే నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను న్యాయమూర్తి ఆదేశించారు. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది సెప్టెంబర్ 4న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.