Begin typing your search above and press return to search.

MAA వార్: విష్ణు మంచు ప్యానెల్ లో ర‌ఘుబాబు

By:  Tupaki Desk   |   18 Sep 2021 3:30 PM GMT
MAA వార్: విష్ణు మంచు ప్యానెల్ లో ర‌ఘుబాబు
X
`మా` ఎన్నిక‌ల వార్ ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. అక్టోబ‌ర్ 10 ఎన్నిక‌ల డెడ్ లైన్ స‌మీపిస్తుండ‌డంతో ఎవ‌రికి వారు అస్త్రాలు రెడీ చేసుకుని వార్ కి రెడీ అయ్యారు. ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టుడు బాబూ మోహ‌న్ ఈ యుద్ధంలోకి దిగారు. మరో సీనియర్ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) యుద్ధంలో చేరుతున్న‌ట్టు ప్ర‌కటించారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రఘు బాబు విష్ణు మంచు ప్యానెల్ లో చేరారు. రఘు బాబు MAA ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయనున్నారు.

ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ - విష్ణు మంచు- CVL నరసింహారావు -కాదంబరి కిరణ్ MAA అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. అన్ని ప్యానెళ్లు అద్భుతమైన రంగులతో బయటకు రావడానికి తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఆస‌క్తిక‌రంగా ఈసారి ఏంటో మీడియా ముందు గ‌డ‌బిడ త‌గ్గిన‌ట్టే కనిపిస్తోంది. ఆరంభంలో క‌నిపించిన దూకుడు ఇప్పుడు లేదు. ముఖ్యంగా మంచు విష్ణు ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో డీసెంట్ గా త‌న ప‌నిని తాను చేసుకుపోతున్నారు. మునుపటి రెండు ఎన్నికలతో పోలిస్తే ఈ సంవత్సరం MAA ఎన్నికలు చాలా ప్రశాంతంగా తక్కువ గందరగోళంగా ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

విందు రాజ‌కీయాలు డీసెంట్ గానే

మావీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో విందు రాజ‌కీయాలు డీసెంట్ గానే సాగుతున్నాయి. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా ఎవ‌రికి వారు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. లంచ్ పార్టీలు.. డిన్న‌ర్ పార్టీలు.. అంటూ మెంబ‌ర్ల ను పార్టీల‌తో ముంచేస్తున్నారు. ప్ర‌ధానంగా పోటీ ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య నెల‌కొన‌డంతో ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం మెంబ‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప‌నిలో బిజీ అయ్యారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో మెంబ‌ర్లంద‌రికీ శ‌నివారం గ్రాండ్ గా లంచ్ పార్టీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రితో ఇంట‌రాక్ట్ అయ్యారు. దాదాపు వంద‌ మంది వ‌ర‌కూ ఈ విందుకు హాజ‌ర‌య్యారు.

లంచ్ అనంత‌రం `మా` సంక్షేమాల‌పై చ‌ర్చించి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్నదానిపైనా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. 10 కోట్ల కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేస్తాన‌ని విల‌క్ష‌ణ న‌టుడు హామీ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా స్పీడ్ పెంచారు. విష్ణు కూడా పార్క్ హ‌య‌త్ లో మెంబ‌ర్ల‌కు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేసారు. పార్క్ హ‌య‌త్ వేదిక‌గా విష్ణు కూడా మంత‌నాలు మొద‌లు పెట్ట‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ సూచ‌న ప్రాయంగా త‌న ఎజెండాను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా ఏం ప్ర‌క‌టిస్తారోన‌ని ఆస‌క్తి నెల‌కొంది. ఇటీవ‌లే `మా ` భ‌వ‌నం సొంత ఖ‌ర్చుతో నిర్మిస్తాన‌ని విష్ణు హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అసోసియేష‌న్ సంక్షేమం కోసం త‌న మ్యానిఫేస్టోని కూడా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఈసీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే న‌రేష్ లంచ్ పార్టీలు ఆ త‌ర‌వాత బ‌రిలో దిగి ప్ర‌కాష్ రాజ్ ఆక‌స్మిక పార్టీ గురించి తెలిసిన‌దే. కొద్దిరోజులుగా.. ప్ర‌కాష్ రాజ్.. విష్ణుల‌ విందు రాజ‌కీయం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

మెగా వ‌ర్సెస్ మంచు అంటూ ప్ర‌చారం!
ప్ర‌కాష్ రాజ్ కి నాగ‌బాబు- చిరంజీవి బృందం సైలెంట్ గా మ‌ద్ధ‌తునిస్తుండ‌గా.. విష్ణు వెన‌క మంచు మోహ‌న్ బాబు-కృష్ణ‌-కృష్ణంరాజు బృందాలు ప‌ని చేస్తున్నాయ‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. వీకే న‌రేష్ మ‌ద్ధ‌తు విష్ణుకే ఉంది. ఈ నేప‌థ్యంలో దీనిని మెగా వ‌ర్సెస్ మంచు వార్ అంటూ ప్ర‌చారం సాగిస్తున్నారు. చివ‌రికి యుద్ధంలో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.