Begin typing your search above and press return to search.

ఇలాంటి టైంలో కూడా సినిమాతో వ్యాపారం చేయగలిన ఇంటెలిజెంట్ ఆర్జీవీ...!

By:  Tupaki Desk   |   22 July 2020 2:40 PM GMT
ఇలాంటి టైంలో కూడా సినిమాతో వ్యాపారం చేయగలిన ఇంటెలిజెంట్ ఆర్జీవీ...!
X
టాలీవుడ్ లో యాంకర్‌ గా, నటుడిగా, సింగర్‌ గా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు రఘు కుంచె. ఇటీవల 'పలాస 1978' సినిమాలో విలన్ పాత్రలో నటించి మరోసారి అలరించాడు. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా మారి సత్యదేవ్ హీరోగా '47 డేస్' అనే సినిమాని నిర్మించాడు. ఇక ఈ సినిమాకి సినీ విమర్శకులు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం పట్ల అసహనానికి గురై ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు లేటెస్టుగా రఘు కుంచె ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి మాట్లాడారు.

రామ్ గోపాల్ వర్మ ''పవర్ స్టార్'' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజయింది. ట్రైలర్ ముందే లీక్ అయినప్పటికీ 'పవర్ స్టార్' ఆఫీసియల్ ట్రైలర్ కి ఇప్పటివరకు 1.6 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని వారందరూ చూస్తారో లేదో అనే విషయం పక్కన పెడితే వర్మ తెలివితేటలని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రఘు కుంచె కూడా ఆర్జీవీ ఇంటెలిజెంట్ అని.. కరోనా టైంలో కూడా సినిమాలు తీస్తూ తెలివితో సినిమా వ్యాపారం చేయడం ఆయనకే చెల్లిందని కొనియాడారు. అయితే ఎందుకో 'పవర్ స్టార్' చూడాలనే ఇంట్రెస్ట్ నాకు లేదని.. ఈ మధ్య రిలీజైన వర్మ రెండు సినిమాలు కూడా చూడలేదని చెప్పుకొచ్చారు.