Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడు మూడేళ్ల తర్వాత ముహూర్తం పెట్టారు

By:  Tupaki Desk   |   8 Oct 2020 4:20 PM IST
దర్శకేంద్రుడు మూడేళ్ల తర్వాత ముహూర్తం పెట్టారు
X
శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు చివరగా 2017లో ఓం నమో వెంకటేశాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకు ముందు 2012లో షిర్డీ సాయి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మద్యలో ఇంటింటి రామాయణం అనే సినిమాను చేసినా కూడా అది కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ కు కొన్ని రోజులు ఉండగా ఆగిపోయింది. అంటే ఎనిమిది ఏళ్ల కాలంలో దర్శకేంద్రుడు కేవలం రెండే రెండు సినిమాలను విడుదల చేశారు. ఇక ఆయన సినిమాలు చేయకపోవచ్చు అని అంతా అనుకున్నారు. ఆయన సినిమాలపై ప్రేక్షకులు ఆశ పెట్టుకోని ఈ సమయంలో దర్శకేంద్రుడు తదుపరి సినిమాకు ముహూర్తం పెట్టారు.

రేపు ఉదయం 11.30 కు తన కొత్త సినిమా ప్రకటన ఉండబోతున్నట్లుగా చిన్న వీడియోను ఆయన విడుదల చేశారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన నుండి సినిమా వస్తున్నందుకు అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. అసలు ఆయన చేయబోతున్న సినిమా ఏంటీ.. స్టార్స్‌ తో చేస్తారా కొత్త వారితో చేస్తారా భారీ బడ్జెట్‌ తో చేస్తారా లేదంటే లో బడ్జెట్‌ లో కానిస్తారా.. భక్తిరస చిత్రమా లేదంటే సాంఘీక సినిమానా అంటూ రకరకాలుగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆయన నుండి ఒక మంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి దర్శకేంద్రుడు ఎలాంటి సినిమాకు ముహూర్తం పెడతారో చూడాలి.