Begin typing your search above and press return to search.

స్టార్స్‌ తో దర్శకేంద్రుడి మల్టీస్టారర్‌?

By:  Tupaki Desk   |   1 Nov 2020 12:30 AM GMT
స్టార్స్‌ తో దర్శకేంద్రుడి మల్టీస్టారర్‌?
X
శతాధిక చిత్రాల దర్శకుడు.. టాలీవుడ్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ లను అందించి ఎంతో మంది స్టార్స్‌ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల మేకింగ్‌ పై దృష్టి పెట్టాడు. తన సూపర్‌ హిట్‌ మూవీ పెళ్లి సందడి సినిమాను మళ్లీ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా శ్రీకాంత్‌ తనయుడు రోహన్‌ తో నిర్మిస్తున్నాడు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మాతగా కూడా రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాను చేస్తున్నాడు. కేవలం పెళ్లి సందడితో మాత్రమే ఆగిపోకుండా మరో భారీ సినిమాను కూడా దర్శకేంద్రుడు మొదలు పెట్టబోతున్నాడట.

టాలీవుడ్‌ వర్గాల వారు మరియు సినీ ప్రముఖుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్‌ స్టార్‌ హీరోలతో మల్టీ స్టారర్‌ ను చేయబోతున్నారట. ఆర్కా మీడియాతో కలిసి రాఘవేంద్ర రావు ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఆ మల్టీ స్టారర్‌ కు కూడా తానే దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడట. ఇప్పటికే మల్టీ స్టారర్ కోసం కథ సిద్దం అయ్యింది. ఇద్దరు హీరోలు సైతం కథకు ఓకే చెప్పడం వచ్చే ఏడాదిలో డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పడం కూడా జరిగి పోయింది.

పెళ్లి సందడి తో పాటు సమాంతరంగా ఈ సినిమాను కూడా దర్శకేంద్రుడు చేయించబోతున్నాడు. శతాధిక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు రాఘవేంద్ర రావు మరిన్ని సినిమాలను కూడా చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మాతగా కూడా ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించాలని భావిస్తున్నారు. ఈ వయసులో ఆయన నటుడిగా కూడా పరిచయం కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కాస్త గ్యాప్‌ తీసుకున్నారాఘవేంద్ర రావు ఫుల్‌ స్వింగ్‌ తో బ్యాక్‌ రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.