Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడికి శివుని అనుగ్రం కావాలట

By:  Tupaki Desk   |   12 Jun 2015 11:15 AM IST
దర్శకేంద్రుడికి శివుని అనుగ్రం కావాలట
X

అన్నమయ్య, రామదాసు, షిరిడీ సాయి వంటి భక్తి రసాత్మక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించారు రాఘవేంద్ర రావు. అప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే తీస్తూ హీరోయిన్ల అందచందాలను సమ్మోహనంగా చిత్రీకరిస్తూ వస్తున్న సమయంలో అన్నమయ్య సినిమా ప్రత్యేకంగా నిలిచి దర్శకేంద్రుడిలోని భక్తి కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. తర్వాత అదే కాబినేషన్ లో వచ్చిన రామదాసు, షిరిడీ సాయి సినిమాలు బాగానే ఆడాయి.

అయితే స్వతహాగా వేంకటేశ్వర స్వామి భక్తుడైన రాఘవేంద్ర రావు గారికి శివుని అనుగ్రం ఎందుకంటే... రెండ్రోజుల క్రితం దర్శకేంద్రుడు ప్రముఖ రచయిత జేకే భారవి తో కలిసి కాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆ కట్టడాన్ని చూసి ముద్గుడయిపోయిన ఈ దర్శకుడు శివానుగ్రహం లభిస్తే శివునిపై మరో సినిమాని తీయాలని వుందని అన్నారు. గతంలో శ్రీ మంజునాధ సినిమాని తెరకెక్కించింది దర్శకేంద్రుడే. శివుని అనుగ్రం లేనిదే చీమైనా కుట్టదంటారు. అందుకే ఈయన కూడా ఆ ముక్కంటి అనుగ్రహాన్ని కోరారేమో..1