Begin typing your search above and press return to search.

నాగ్ తో సెంచరీ కొట్టించబోతున్న దర్శకేంద్రుడు

By:  Tupaki Desk   |   30 Jun 2022 7:30 AM GMT
నాగ్ తో సెంచరీ కొట్టించబోతున్న దర్శకేంద్రుడు
X
టాలీవుడ్‌ కింగ్ నాగార్జున సినిమా ల సంఖ్య సెంచరీకి దగ్గర పడ్డాయి. ఆయన అభిమానుల లెక్క ప్రకారం ఇప్పటికే నాగార్జున వంద సినిమాలు అయ్యాయి. కాని కొన్ని గెస్ట్ రోల్స్ చేసిన సినిమా లను తీసివేస్తే నాగార్జున సినిమాల లెక్క ఇంకా వంద కాలేదు. కొన్నాళ్ల క్రితం నాగార్జున తన లెక్కలో వందవ సినిమా కు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చాడు.

మళ్లీ నాగార్జున వందవ సినిమా యొక్క వార్తలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌' సినిమా లో నటిస్తున్నాడు. ఆ తర్వాత నటించబోతున్న సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నాగార్జున వందవ సినిమా గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా ఉంటుంది అంటూ మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో నాగార్జున మరియు రాఘవేంద్ర రావు ల కాంబినేషన్ లో అన్నమయ్య మరియు శ్రీరామదాసు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నాగార్జున సినీ కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా లుగా అవి పేరు దక్కించుకున్నాయి. అలాంటి మరో సినిమా ను నాగార్జున వందవ సినిమా గా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడు రాఘవేంద్రరావు ఈ మద్య కాలంలో చేసిన సినిమాలన్నీ ప్లాప్‌ అవుతుండటంతో దర్శకత్వంకు దూరంగా ఉన్నాడు. నిర్మాణంలో ఉన్న రాఘవేంద్ర రావు మరోసారి మెగా ఫోన్ పట్టి నాగార్జున తో వందవ సినిమా ను చేయించబోతున్నట్లుగా అక్కినేని ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

నాగార్జున కూడా ఈమద్య కాలంలో కాస్త డల్‌ అయ్యాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మునుపటి మాదిరిగా ఓ రేంజ్ లో వసూళ్లను దక్కించుకోలేక పోతున్నాయి. అందుకే వందవ సినిమా తో తన పూర్వ వైభవం కి రావాలని నాగార్జున కోరుకుంటున్నాడు.

అందుకే ఆ బాధ్యత ను రాఘవేంద్ర రావు కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనేమో.