Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడు అంత మాటన్నారా!!

By:  Tupaki Desk   |   4 April 2017 5:01 AM GMT
దర్శకేంద్రుడు అంత మాటన్నారా!!
X
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గత కొన్ని సంవత్సరాలుగా కేవలం భక్తి చిత్రాలే తీస్తున్నారు. మెప్పిస్తున్నారు. అన్నమయ్య నుంచి మొదలుపెట్టి వరుసగా భక్తి రస చిత్రాలనే ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే.. ఈయనకు రీసెంట్ గా ఓ కమర్షియల్ మూవీ చేయాలంటూ ప్రతిపాదన వచ్చిందట.

ఆ ప్రపోజల్ చేసిన వ్యక్తి కూడా ఎవరో కాదు.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నుంచి ఈ ప్రతిపాదన అందింది. అయితే.. దీనికి రాఘవేంద్రరావు నుంచి వచ్చిన సమాధానం మాత్రం అనూహ్యమే. 'ఇప్పుడు నేను కమర్షియల్ సినిమా చేస్తే.. జనాలు చూస్తారా?' అనేశారట కేఆర్ ఆర్. ఆ ఒక్క మాట అనేసి నవ్వేయడం తప్ప.. మరింకే సమాధానం కూడా ఇవ్వలేదట ఆయన. సింపుల్ గా తన నవ్వుతోనే చేయననే సమాధానం ఇచ్చేశారన్న మాట. దర్శకేంద్రుడు నుంచి కమర్షియల్ సినిమాపై ఇంత మాట రావడం ఆశ్చర్యకరమే.అసలు తెలుగు సినిమాకు బోలెడన్ని కమర్షియల్ హంగులు అద్దినదే మన దర్శకేంద్రుడు.

డ్యాన్సులు.. ఫైట్లు.. హీరోయిజం.. హీరోయిన్ల ఒంపుసొంపులు.. అందాల ప్రదర్శనతో పాటు హీరోయిన్ బొడ్డుపై పళ్లు.. పూలు చల్లడం వంటి ఎన్నో తనదైన కమర్షియల్ హంగులు జోడించి సినిమా తీసిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు తన మేకింగ్ స్టైల్ లో కమర్షియల్ మూవీస్ జనాలు చూడరనే అభిప్రాయానికి వచ్చేసినట్లు అర్ధమవుతోంది. ఈయన తాజా భక్తి చిత్రం ఓం నమో వేంకటేశాయ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/