Begin typing your search above and press return to search.

అతి శృతి మించుతోంది బాసూ

By:  Tupaki Desk   |   20 April 2019 10:29 AM IST
అతి శృతి మించుతోంది బాసూ
X
నిన్న మూవీ లవర్స్ యనానిమస్ గా జెర్సీకే ఓటేసినా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగు పెట్టిన కాంచన 3 కూడా హాలిడే పుణ్యమా అని డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. బిసి సెంటర్స్ లో అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు కావడం అబద్దం కాదు. లారెన్స్ అంటే ఏదో రకంగా భయపెడుతూనే ఎంటర్ టైన్ చేస్తాడనే నమ్మకంతో జనం బాగానే వచ్చారు.

కానీ లారెన్స్ మాత్రం నా తీరు ఇంతే అనే తరహాలో ఇంతకు ముందు తీసిన ముని కాంచన సిరీస్ లోని అదే కథను తీసుకుని వాటికే స్వల్ప మార్పులు చేసి సేమ్ ఫార్ములాను రిపీట్ చేశాడు తప్ప ఇంచు కూడా కొత్తదనం లేదన్న మాట వాస్తవం. మాస్ జనం ఇదే కోరుతున్నారు కాబట్టి అదే తీస్తున్నాను అని లారెన్స్ చెప్పుకోవచ్చు గాక కానీ ఇదే హారర్ జానర్ ఇంకా డిఫరెంట్ గా ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా

ఇప్పుడు కాంచన 3 కి కమర్షియల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కాంచన 4 ఎంత త్వరగా వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. టాక్ తో పాటు రివ్యూలు అధిక శాతం నెగటివ్ గా ఉన్నప్పటికీ వీకెండ్ ని లారెన్స్ వాడుకునేలా కనిపిస్తున్నాడు. ఒక ఇంట్లో దెయ్యాలు దాని వెనుక ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే హీరో శరీరంలోకి అవి ప్రవేశించి ఫ్యామిలీతో సరదాగా ఆదుకోవడం ఇందులో కాంచన 3 కూడా వీటికి మినహాయింపు కాదు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది కాబట్టి చాలా సీన్లు నిలబడ్డాయి కానీ లేకపోతే అవుట్ పుట్ ఇంకా తేడాగా ఉండేది.