Begin typing your search above and press return to search.

దానగుణంలో ఆయనకి సాటిలేరు అనిపించుకున్న డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   17 April 2020 6:50 AM GMT
దానగుణంలో ఆయనకి సాటిలేరు అనిపించుకున్న డైరెక్టర్...!
X
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఎంతో మంది సినీ హీరోలు విరాళాలు అందజేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా సినీ కార్మికులకు పని లేకపోతే గాని ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వారికోసం సినీ పెద్దలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మన టాలీవుడ్ లో సినీ పెద్దలు 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసి వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద సినీ కార్మికులను ఆదుకోడానికి అన్ని ఇండస్ట్రీల నుండి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. వారికి సాయం చేయడానికి డాన్స్ మాస్టర్ - దర్శకుడు లారెన్స్ కూడా ముందుకొచ్చారు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం చేసే వారిలో ముందుటాడు రాఘవ లారెన్స్. తను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజసేవకే ఉపయోగిస్తుంటారు. చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి అందులో విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లారెన్స్ కరోనా రిలీఫ్ ఫండ్ అంటూ 3 కోట్ల రూపాయలను డొనేట్ చేశాడు.

అందులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 ల‌క్ష‌లు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. అంతటితో ఆపకుండా మధ్యమధ్యలో మరిన్ని మంచి పనుల్లో సాయం అందిస్తున్నాడు. ఈ కష్టకాలంలో లారెన్స్ చేసిన మరో మంచి పనితో నిజమైన హీరోగా తమిళ సినీవర్గాలకు మరీంత దగ్గరయ్యాడు. తమిళ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కి 25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తన డోనేషన్స్ కి అంతం లేదని చెప్పకనే చెప్పాడు. ఇటీవల తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 15లక్షల వరకు శానిటేషన్ వర్కర్స్ కోసం అందజేశారు. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. లారెన్స్ వీలైనంత వరకు రోజూ ఏదొక విధంగా జనాలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అక్షయ్ కుమార్ తో 'కాంచన' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌ గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.