Begin typing your search above and press return to search.

ఓ డైరెక్టర్ సాబ్.. ఈ విరాళాల ప్రచారమేంది?

By:  Tupaki Desk   |   13 April 2020 4:15 AM GMT
ఓ డైరెక్టర్ సాబ్.. ఈ విరాళాల ప్రచారమేంది?
X
ఇది కరోనా టైం. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. అన్నార్థులు, అసహాయులకు సాయం చేయడానికి ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ముందుకొచ్చారు. హిందీలో అక్షయ్, తెలుగులో ప్రభాస్ లాంటి వారు కోట్లు దానమిచ్చి అపర దానకర్ణుడులాగా కీర్తినందుకున్నారు. ఇక బాహుబలి సినిమాలతో కోట్లు సంపాదించిన రాజమౌళి లాంటి వారికి కోట్లు దానం చేయడానికి ధైర్యం రాలేదు. నిర్మాత తో కలిసి 10 లక్షలు విరాళమిచ్చాడు.. మాస్క్ లు, శానిటైజర్లు సహా బయట సాయం చేశారు. విరాళాలు చేస్తే చేయాలి.. లేదంటే గమ్మున ఊరుకోవాలి.. కానీ మన డ్యాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ లాఘవ లారెన్స్ మాత్రం తను విరాళాల్లో దానకర్ణుడిగా నిరూపించుకునేందుకు తెగ గింజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

లాఘవ లారెన్స్ తాజాగా కరోనా మహమ్మారిపై పోరాడేందుకు 3 కోట్ల విరాళం ప్రకటించారు. అక్కడితో ఆ టాపిక్ ఆగితే అతడిని అందరూ కీర్తించేవారే. ఆ తర్వాత ఆ విరాళాల చుట్టూ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు విమర్శలకు కారణమైంది.

రాఘవ లారెన్స్ ఆ 3 కోట్లు ఎక్కడివి అనే విషయాన్ని సైతం బయటపెట్టి ఇచ్చిన వారిని ఇరకాటంలో పెట్టారు. చంద్రముఖి2 సినిమా కోసం సన్ పిక్చర్స్ సంస్థ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ 3 కోట్లు అని లీక్ చేశాడు. అది వివాదాస్పదమైంది. సన్ పిక్చర్స్ ను ఇరకాటంలో పెట్టింది.

ఇది చాలదన్నట్టు 3 కోట్లు విరాళం ఇవ్వగానే తనకు చాలా మంది ఫోన్లు చేసి తమ సమస్యలు చెబుతూ ఆదుకోమని ఏడ్చారని. వాళ్లకు సాయం చేయలేకపోతున్నానంటూ రాఘవ లారెన్స్ బాధపడ్డాడట.. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. రాఘవ లారెన్స్ ఓవరాక్షన్ పై ఇప్పుడు ట్విట్టర్ లో నెటిజన్లు పంచులేస్తున్నారు. నువ్వు గాంక చేశావ్ లేవోయ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నీ ఓవరాక్షన్ ఆపు అంటూ హితవు పలుకుతున్నారు.