Begin typing your search above and press return to search.

లారెన్స్ మాస్టార్ హ‌ర్ట్.. క‌ఠిన నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   23 Dec 2019 1:18 PM IST
లారెన్స్ మాస్టార్ హ‌ర్ట్.. క‌ఠిన నిర్ణ‌యం!
X
రాఘ‌వ లారెన్స్ మాస్టార్ హ‌ర్ట‌య్యారా? ఉన్న‌ట్టుండి ఏమైంది? ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చింది? .. ప్ర‌స్తుతం అభిమానుల్లో సందేహం ఇది. అస‌లింత‌కీ లారెన్స్ తీసుకున్న ఆ నిర్ణ‌యం ఏమిటి? అంటే.. ఇక‌పై ఏ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ కి తాను అతిధిగా హాజ‌రు కాబోన‌ని లారెన్స్ స‌డెన్ డెసిష‌న్ తీసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది.

``ర‌జ‌నీకాంత్ స‌ర్ సినిమా కార్య‌క్ర‌మాల‌ కు త‌ప్ప ఇక ఏ వేడుక‌కు ఎటెండ్ కాను. అది కూడా ర‌జ‌నీ స‌ర్ అనుమ‌తి తీసుకున్నాకే ఆ కార్య‌క్ర‌మానికి వ‌స్తాను. వేరొక ప‌బ్లిక్ ఈవెంట్ కి రాలేను. ఈ నిర్ణ‌యాని కి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. అవ‌న్నీ మీతో చెప్ప‌ లేను. నాకు ర‌జ‌నీ దీవెన‌ల కంటే ఇంకేదీ ముఖ్యం కాదు`` అంటూ సామాజిక మాధ్య‌మాల్లో కాస్త ఎమోష‌న‌ల్ పోస్ట్ చేయ‌డం తో ఫ్యాన్స్ లో ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌ల‌కు కార‌ణ‌మైంది.

ఇటీవ‌ల `ద‌ర్బార్` ఈవెంట్లో మాట్లాడుతూ ``ర‌జ‌నీ కాంత్ అభిమాని ని అవ్వ‌డం వ‌ల్ల క‌మ‌ల్ హాస‌న్ సినిమా పోస్ట‌ర్ల‌ పై పేడ చ‌ల్లాన‌ని.. అదంతా అభిమానం తో అప‌రిప‌క్వం గా చేసిన ప‌ని`` అని వ్యాఖ్యానించారు లారెన్స్. అటుపై క‌మ‌ల్ హాస‌న్ డైహార్డ్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవ్వ‌డ‌మే గాక లారెన్స్ పై సోష‌ల్ మీడియా లో వ్య‌తిరేక ప్ర‌చారం సాగించారు. ట్రోల్స్ తో విరుచుకు ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే క‌మ‌ల్ హాస‌న్ ని క‌లిసి మ‌రీ లారెన్స్ సారీ చెప్పారు. తాను ఏ ప‌రిస్థితి లో అలా చేయాల్సి వ‌చ్చింది ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ అభిమానుల‌ కు లారెన్స్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇప్ప‌టికీ క‌మ‌ల్ ఫ్యాన్స్ సీరియ‌స్ గా ఉండ‌డం తో మ‌రోసారి ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించార‌న్న‌మాట‌.