Begin typing your search above and press return to search.

అన్న వెంటే నా ప్రయాణం

By:  Tupaki Desk   |   8 Jan 2018 6:03 PM IST
అన్న వెంటే నా ప్రయాణం
X
సూపర్ స్టార్ రజనికాంత్ అంటే బయటే కాదు ఇండస్ట్రీలో కూడా లెక్కబెట్టలేనంత ఫాన్స్ ఉన్నారు. అందులో ముందు వరసలో ఉండేది రాఘవ లారెన్స్. డాన్స్ ట్రూప్ లో మెంబెర్ గా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా - హీరోగా - నిర్మాతగా ఇలా ఒక్కో అడుగు ముందు వేస్తూ కోలీవుడ్ లోనే కాదు ముని సిరీస్ తో టాలీవుడ్ లో కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. చిరంజీవి స్టెప్స్ తో గతంలోనే ఎంతో పాపులారిటీ దక్కించుకున్న లారెన్స్ ఇప్పుడు తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్న వేళ తన పూర్తి మద్దతుని రజినీకాంత్ కు తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా ప్రకటించేసాడు. తన 12 ఏళ్ళ నాటి రజినితో తీసుకున్న జ్ఞాపకాన్ని ఫోటో రూపంలో షేర్ చేసుకున్న లారెన్స్ సూపర్ స్టార్ అభిమాన సంఘంలో అంత చిన్న వయసులో నే చేరిన సంగతి నెమరు వేసుకున్నాడు.

తాను జీవితాంతం రజిని వెంటే నడుస్తాను అని స్పష్టం చేసిన లారెన్స్ రాజకీయ పరంగా కూడా తన సపోర్ట్ తలైవాకే ఉంటుందని చెప్పేసాడు. జనవరి 9న తన పుట్టిన రోజు సందర్భంగా లారెన్స్ ఇవి పంచుకోవడంతో అతని అభిమానులతో పాటు రజని ఫాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ ఆవుతున్నారు. కొద్ది రోజుల క్రితం హీరో విశాల్ రజని పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో తానే స్వయంగా ప్రచారం చేస్తాను అని చెప్పడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇంతలో లారెన్స్ కూడా మద్దతు పలకడంతో మిగిలినవాళ్ళలో ఒక్కొక్కరు రజని కోసం బయటపడే సూచనలు ఉన్నాయి. జీవితంలో ఎన్నడు రజని బాట వీడే సమస్యే లేదని చెప్పేసిన లారెన్స్ మాటకు రజనికాంత్ స్పందన ఇంకా రాలేదు. పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు త్వరలోనే మొదలుపెట్టనున్న రజని పార్టీ కోసం ఇంకెంతమంది తారలు వస్తారో అని ఆసక్తికరంగా మారింది.