Begin typing your search above and press return to search.

రాధిక రాజేస్తోంది.. వేడికి తట్టుకుంటారా

By:  Tupaki Desk   |   18 May 2016 7:59 AM GMT
రాధిక రాజేస్తోంది.. వేడికి తట్టుకుంటారా
X
రాధికా ఆప్టే ట్యాలెంటెడ్ హీరోయిన్ అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడీ భామలోని హాట్ నెస్ అంతా బయటకు వచ్చేస్తోంది. అమ్మడు పుట్టిస్తున్న వేడికి చాలామంది మైకంతో కాలిపోతున్నారు. ఈ హాట్ ఇప్పటికే టాప్ డైరెక్టర్లను తాకేసింది. తన గత 3 జన్మలలో ఇలాంటి హాటీని చూడలేదని ట్వీట్ చేసేశాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

మరి వర్మ మాటలు జోష్ ఇచ్చాయో, ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ జోష్ ఇచ్చిందో తెలీదు కానీ.. రాధికా ఆప్టే మాత్రం డోస్ పెంచేసింది. అందచందాలను దాచుకోవడం కంటే.. అందరికీ చూపించడమే లక్ష్యంగా పెట్టేసుకుంది. రీసెంట్ గా జీక్యూ మేగజైన్ కోసం అమ్మడు ఓ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ కలర్ కోట్ వేసుకుని.. లోపల ఏం వేసుకోకుండా.. ముందు బటన్స్ అన్నిటినీ వదిలేసి రాధికా ఆప్టే ఇచ్చిన పోజులు.. చూసినోళ్ల కళ్లలోనే మంటలు పుట్టిస్తున్నాయి. హాట్ భామలను చాలామందినే చూసినా.. రాధికా రాజేస్తున్న మంటను తట్టుకోవడం మాత్రం సాధ్యం కాలేదని ఫీలయిపోతున్నారు జనాలు.

ఫ్యాన్స్ కి మత్తెక్కించడానికి క్లీవేజ్ చూపిస్తోందో.. లేక తన అందాలు చూపించి మైకంలో పడేయాలని అనుకుంటోందో కానీ.. రాధికా ఆప్టే మాత్రం స్పీడ్ పెంచుతూనే ఉంది. ఇప్పటికి ఇంకా రాధిక ఫోటోషూట్ చేసిన మేగజైన్ ఫుల్లుగా బైటకు రాలేదు. పబ్లిసిటీ కోసం ఇచ్చిన ఫోటోలే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక మొత్తం మేగజైన్ అంతా చూస్తే.. రాధికా ఆప్టే పుట్టించే వేడికి.. జనాలు తన్మయత్వంతో కాలిపోతారేమో!!