Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ చిరును నిజంగా కొట్టేసిందట

By:  Tupaki Desk   |   11 July 2016 5:00 PM IST
ఆ హీరోయిన్ చిరును నిజంగా కొట్టేసిందట
X
తన తీరుకు భిన్నంగా.. తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి. చిరంజీవి మొదలుకొని ఎందరో ప్రముఖ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన నోటి నుంచి రాని కొత్త తరహా మాటలు తాజాగా వచ్చేస్తున్నాయి. చిరు 150వ మూవీ సందేశాత్మకంగా ఉంటే జనాలు చూడరని.. నవ్వుతారంటూ వ్యాఖ్యలు చేసి ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సంచలన అంశాన్ని చెప్పుకొచ్చారు.

చిరంజీవి.. రాధికతో ‘‘న్యాయం కావాలి’’ సినిమా షూటింగ్ సమయంలో.. ఒక సీన్ లో చిరంజీవిని రాధిక కొట్టాల్సి ఉందట. ఆ సీన్ షూటింగ్ చేసే సమయంలో చిరును రాధిక నిజంగానే కొట్టేశారట. దీంతో.. చిరు ఒక్కసారి షాక్ తిన్నారట. ఆ తర్వాత ఒక సీన్ లో రాధికను చిరంజీవి కొట్టాల్సిన సీన్ వచ్చిందట. ఆ సీన్లోనూ చిరు నిజంగానే రాధికను కొట్టేశారంట.

దీంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పాత ముచ్చటను చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత అభిలాష సినిమాలో వీరిద్దరితో సినిమా చేయాల్సి వచ్చిందని.. ఆ షూటింగ్ సమయంలో ఇరువురు ఎడమొఖం.. పెడముఖంగా ఉండేవారని.. ఇగోలను పక్కన పెట్టాలంటూ నచ్చజెప్పానని.. వారు తన మాట విని.. సహకరించటంతో సినిమా హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎంత పాత ముచ్చటనైనా కొత్తగా చెప్పిన కోదండరామిరెడ్డి మాటలు ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూడాలి.