Begin typing your search above and press return to search.

మాజీ ముఖ్యమంత్రి భార్య సినిమాల్లోకి రీఎంట్రీ

By:  Tupaki Desk   |   9 July 2017 12:18 PM IST
మాజీ ముఖ్యమంత్రి భార్య సినిమాల్లోకి రీఎంట్రీ
X
నందమూరి తారకరత్న హీరోగా అప్పట్లో ‘భద్రాద్రి రాముడు’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? అందులో ఓ అందమైన అమ్మాయి కథానాయికగా నటించింది. తన పేరు.. రాధిక. కన్నడలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కెరీర్ మంచి ఊపులో ఉండగా... ఆమె తన కంటే పెద్దవాడైన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని పెళ్లి చేసుకుని షాకిచ్చింది. కుమారస్వామికి అప్పటికే పెళ్లయింది. ఆయన తొలి భార్య కొడుకే ఈ మధ్య ‘జాగ్వార్’తో కథానాయకుడిగా పరిచమయమైన నిఖిల్ గౌడ. కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుమారస్వామి-రాధిక దంపతులకు ఓ పాప కూడా పుట్టింది. పెళ్లి తర్వాత రాధిక సినిమాల వైపు చూడలేదు. ఇంటికే పరిమితమైపోయింది.

ఐతే ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తోంది. అది కూడా హీరోయిన్ గా మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. సీనియర్ నటుడు రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజేంద్ర పొన్నప్ప’ అనే చిత్రంలో ఆమె కథాయినాయికగా నటించబోతుండటం విశేషం. ఇందులో హీరో కూడా రవిచంద్రనే. దాదాపు పదకొండేళ్ల తరువాత రవిచంద్రన్.. రాధిక జంటగా నటిస్తుండటం విశేషం. రవిచంద్రన్‌ స్వతహాగా తన సినిమాలకు తనే దర్శకత్వం వహిస్తుంటాడు. రవిచంద్రన్ వచ్చి అడగడంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో.. రాధిక మళ్లీ సినిమాల్లో నటించడానికి కుమారస్వామి ఒప్పుకున్నట్లు సమాచారం.