Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా న‌టించ‌బోతోన్న సీఎం భార్య‌!

By:  Tupaki Desk   |   9 April 2018 1:06 PM GMT
హీరోయిన్ గా న‌టించ‌బోతోన్న సీఎం భార్య‌!
X
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో అధికారాన్ని నిల‌బెట్టుకొని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. క‌ర్ణాట‌కలో విజ‌యం సాధించి ద‌క్షిణాదిపై ప‌ట్టు సాధించేందుకు తొలి అడుగు వేయాల‌ని బీజేపీ పావులు క‌దుపుతోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత క‌న్న‌డ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ ప్ర‌ధాని హెచ్ డీ దేవెగౌడ కుమారుడు, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్ డీ కుమార స్వామి తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చారు. కొంత‌కాలం నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న కుమార స్వామి రాబోయే ఎన్నిక‌ల్లో సీఎం పీఠం అధిష్టించాల‌ని పావులు క‌దుపుతున్నారు. అయితే, గ‌తంలో బీజేపీతో ఉన్న విభేదాల‌ను ప‌క్క‌న‌బెట్టి ఆ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డ‌మో లేదా కాం గ్రెస్ తో `చేతులు` క‌ల‌ప‌డ‌మో చేస్తే గానీ కుమార స్వామి సీఎం అయ్యే చాన్స్ లేదు. అందుకే, త‌న పార్టీ జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్) త‌ర‌ఫున సాధ్య‌మైన‌న్ని సీట్లలో గెలుపొందేందుకు పావులు క‌దుపుతున్నారు.

గ‌తంలో బీజేపీ మ‌ద్ద‌తుతో కుమార స్వామి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఐదేళ్ల ప‌ద‌వీకాలాన్ని బీజేపీతో క‌లిసి పంచుకోవాల‌న్న ఒప్పందాన్ని తుంగ‌లో తొక్కిన కుమార‌స్వామి పూర్తి 5 సంవ‌త్స‌రాలు తానే సీఎంగా ఉన్నారు. త‌న రెండున్న‌రేళ్ల ప‌దవీకాలం ముగిసిన త‌ర్వాత‌ యడ్యూరప్ప సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌బోతోన్న సమయంలో త‌న మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ వ్య‌వ‌హారంతో యడ్యూరప్ప కంట‌త‌డిపెట్టుకొని సానుభూతి కొట్టేయ‌డంతో కుమార‌స్వామిపై నెగెటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. ఇంకా చెప్పాలంటే ...క‌ర్ణాట‌క‌లో పెద్ద‌గా ప‌ట్టు లేని బీజేపీకి ఆ సానుభూతి బాగా వ‌ర్క‌వుట్ అయింది. ఆ సానుభూతి ప‌వ‌నాలు బ‌లంగా వీచ‌డంతో త‌ర్వాతి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమార‌స్వామి ద‌య‌వల్ల ప్ర‌స్తుతం బీజేపీ కర్ణాటకలో ప్ర‌ధాన పార్టీగా అవ‌త‌రించింది.

ఓవైపు కుమారస్వామి మ‌ళ్లీ సీఎం కావాల‌ని పావులు క‌దుపుతోంటే....ఆమె రెండో భార్య రాధికా కుమార స్వామి సినిమాల్లో న‌టించేందుకు రెడీ అయ్యారు. కుమారస్వామి మొదటి భార్య అనితా కుమారస్వామి ఎన్నికల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రాధికా కుమారస్వామి ఓ తెలుగు సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అర్జున్ హీరోగా జేడీ చక్రవర్తి కీల‌క‌మైన పాత్ర పోషిస్తోన్న ‘కాంట్రాక్ట్’ అనే తెలుగు సినిమాలో ఆమె నటించ‌బోతోంద‌ట‌. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాష‌ల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి రూపొందించ‌బోతున్నారు.