Begin typing your search above and press return to search.

సిఎం రెండో భార్య హారర్ సినిమా

By:  Tupaki Desk   |   1 Jan 2019 2:38 PM IST
సిఎం రెండో భార్య హారర్ సినిమా
X
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధికా కుమారస్వామి కంబ్యాక్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దమయంతి పేరుతో రూపొందుతున్న ఈ మూవీ హారర్ కం థ్రిల్లర్ జానర్ లో రూపొందుతోంది. నవరసన్ దర్శకత్వం వహించిన దమయంతి తెలుగు తమిళ్ కన్నడ మూడు భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. విడుదల కూడా వచ్చే నెలలోనే ప్లాన్ చేసారు. కీలకమైన భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే క్రమం తప్పకుండ వదిలిన స్టిల్స్ రాధికా ఏదో గట్టిగా ట్రై చేసిన సిగ్నల్స్ ఇస్తున్నాయి. అఘోరాగా ఓసారి కాళికాదేవి రూపంలో మరోసారి ఇలా రాధికా చేసిన రచ్చ మాములుగా లేదు.

రమేష్ అరవింద్-రంగాయన రఘుతో పాటు సాయి కుమార్ తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కం విలన్ రవి శంకర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నికల టైంలో అనవసర వివాదాలకు అవకాశం ఇవ్వకుండా కొన్నాళ్ళు రాధికాను అండర్ గ్రౌండ్ లో పెట్టేసిన కుమారస్వామి తర్వాత స్వేచ్ఛ ఇచ్చేసాడు. రాధికా కుమారస్వామి మనకూ సూపరిచురాలే. గతంలో తారకరత్న హీరోగా రూపొందిన భద్రాద్రి రాముడులో హీరోయిన్ గా నటించింది.

కన్నడ తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాధికా తెలుగులో చివరిసారి కనిపించింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారంలో. అందులో ఓవర్ సెంటిమెంట్ తో తన పాత్ర పెట్టిన కంటతడి చూసినవాళ్లకు ఇంకా గుర్తే. తెలుగులో సైతం ఈ దమయంతి తనకు మళ్ళి అవకాశాలు తెస్తుందని నమ్మకంతో ఉంది రాధికా. షాకింగ్ ఏంటంటే ఇవి కాకుండా భైరా దేవి-కాంట్రాక్ట్-రాజా పోనప్ప-నిమగాగి అనే మరో నాలుగు సినిమాలు సెట్స్ మీదున్నాయి. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు సాక్ష్యాత్తు సీఎం సతీమణి అందులోనూ హీరోయిన్. ఛాన్సులకు కొదవేముంటుంది .