Begin typing your search above and press return to search.

రాధికా ఆప్టే మేక‌ప్ లెస్ లుక్ బెడిసి కొట్టిందే!

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:30 AM GMT
రాధికా ఆప్టే మేక‌ప్ లెస్ లుక్ బెడిసి కొట్టిందే!
X
షూటింగ్ ఉన్నా..లేక‌పోయినా హీరోయిన్ల‌కి మ్యాక‌ప్ లుక్ త‌ప్ప‌నిస‌రి. అప్పుడ‌ప్పుడు మ్యాక‌ప్ లెస్ లుక్ లో క‌నిపించాల‌ని ప్ర‌య‌త్నించినా...అది కొంద‌రికే వ‌ర్కౌట్ అవుతుంది. త‌మ‌లోని నేచుర్ బ్యూటీని ఆవిష్క‌రించాల‌ని కొంద‌రు భామా మ‌ణులు సీరియ‌స్ గానే థింక్ చేస్తుంటారు. ఆ ర‌కంగా ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే అప్పుడ‌ప్పుడు బెడిసి కొడుతుంది. ఎప్పుడూ మ్యాక‌ప్ లోనే చూసే బ్యూటీల్ని ఒక్క‌సారిగా పేక‌ప్ చెప్పేసిన లుక్ లో చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. స‌రిగ్గా రాధికా ఆప్టేని చూస్తే అదే జ‌రిగిందిప్పుడు. రాధికా ఆప్టే మ్యాక‌ప్ లెస్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. లింక్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క‌సారిగా ఖంగుతినాల్సి వ‌చ్చింది.

అవును ముఖానికి ఎలాంటి మ్యాక‌ప్ లేకుండా త‌న‌లో స‌హ‌జ‌సిద్ద‌మైన అందాన్ని అభిమానుల‌కు ఇలా చూపించి షాక్ ఇచ్చింది. మ్యాక‌ప్ లేక‌పోగా బ‌క్క ప‌ల‌చ‌ని శ‌రీరంలో మ‌రింత డీ గ్లామ‌ర్ గా క‌నిపిస్తుంది. లో దుస్తుల‌పై క్యాజువ‌ల్ ష‌ర్ట్ ధ‌రించి న‌వ్వుతూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఈ ప్ర‌య‌త్నం మాత్రం ప్ర‌శంసించ‌ద‌గ్గ‌ది. మ్యాక‌ప్ లేక‌పోతే హీరోయిన్లు ఎలా ఉంటారు? అని అంచ‌నా వేయ‌డ‌య‌నికి ఇదొక మంచి సంద‌ర్భం.

ఇటీవ‌లి కాలంలో చాలా మంది భామ‌లు త‌మ‌లోని నేచుర్ బ్యూటీని ఆవిష్క‌రించ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట ప‌డుతున్నారు. మ్యాక‌ప్ లుక్ కి..ప్యాక‌ప్ లుక్ కి వ్య‌త్యాసం చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. కానీ హీరోయిన్లు అంటే అభిమానులు ఎన్నో ర‌కాలగా ఊహించుకుంటారు. అందాన్ని..అందాల్ని ఊహించుకుని ఊహ‌ల్లో తేలిపోతుంటారు.

లేడీ ఫాలోవ‌ర్స్ అభిమానులుగా మార‌తారంటే? కార‌ణం బ్యూటీకి ఫిదా అవ్వ‌డ‌మే. కానీ ఇలాంటి ప్ర‌యోగాల కార‌ణంగా ఊహ‌ల‌న్ని పేక మేడ‌లా ఒక్క‌సారిగా కూలిపోతాయి అన్న‌ది గ్ర‌హించాలి. రాధికా ఆప్టే ఇలాంటి మ్యాక‌ప్ లెస్ లుక్ లో క‌నిపించ‌డం కొత్తేం కాదు. గ‌తంలో కొన్ని సినిమాల్లో పాత్ర‌ల కోసం ఎలాంటి మ్యాక‌ప్ వేసుకోకుండానే న‌టించింది.

నేచుర్ బ్యూటీతో..నేచుర్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. తాజాగా ఓ టూర్ లో ఉన్న రాధికా ఆప్టే వెళ్లే మార్గంలో రెస్టారెంట్ లో స్నాక్స్ తీసుకుంటూ చిక్కించింది. ఇక న‌టిగా రాధికా ఆప్టే బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'ఫోరెన్సిక్' షూటింగ్ పూర్తిచేసింది. హృతిక్ రోష‌న్..సైఫ్ అలీఖాన్ న‌టిస్తోన్న 'విక్ర‌మ్ వేద' రీమేక్ లోనూ న‌టిస్తోంది. అలాగే వాస‌న్ బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'మోనిక ఓ మైడార్లింగ్' లోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది.