Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : రేసులోనే ఉన్నానంటూ రెచ్చిపోతున్న రాధికా..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 9:30 AM GMT
ఫోటో స్టోరీ : రేసులోనే ఉన్నానంటూ రెచ్చిపోతున్న రాధికా..!
X
తనని వాడుకోవాలే కానీ ఎలాంటి పాత్రలో అయినా తన సత్తా చాటుతా అంటూ కెరియర్ మొదటి నుంచి తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తుంది రాధికా ఆప్టే. ఏ హీరోయిన్ చేయని సాహసాలు చేసింది రాధికా. బోల్డ్ గా నటించడంలో ఏమాత్రం మొహమాటం లేకుండా చేసిన అమ్మడు అప్పట్లో ఓ హాలీవుడ్ సినిమాలో న్యూడ్ గా నటించి షాక్ ఇచ్చింది. కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఇప్పటికీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటుంది రాధికా ఆప్టే.

ప్రతి విషయంలో తన వాయిస్ ని బలంగా వినిపించడంలో ముందుంటుంది రాధికా ఆప్టే. అందుకే ఆ మధ్య ఒకసారి సినిమాకు హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఇంపార్టెంటే అని సంచలనం సృష్టించింది రాధికా ఆప్టే. అంతేకాదు తనని వాడుకోవాలని చూసిన సినిమా వాళ్ల మీద కూడా మీటూ మూమెంట్ లో రఫ్ఫాడించేసింది రాధికా ఆప్టే. కేవలం కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర పడకుండా రకరకాల పాత్రలు చేస్తూ వచ్చింది అమ్మడు. కేవలం స్టార్ హీరోల సినిమాలే కాదు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను చేసింది రాధిక.

తెలుగులో కూడా రాధికా నటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించిన రాధికా ఆప్టే ఆర్జీవి రక్త చరిత్రలో కూడా ఛాన్స్ అందుకుంది. సినిమాల్లో మేల్ డామినేషన్ మీద తన డేరింగ్ స్టేట్ మెంట్ తో దుమ్ముదులిపేస్తుంది రాధికా ఆ విషయంలో ఆమెని చూసి చాలామంది హీరోయిన్స్ స్పూర్తి పొందుతున్నారు.

ఈ మధ్య తన దూకుడు తగ్గించిన రాధికా టీవీ సీరీస్ లలో నటించింది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ ఫోరెన్సిక్, విక్రం వేద సినిమాల్లో నటించిన రాధిక మోనికా ఓ మై డార్లింగ్, మిస్సెస్ అండర్ కవర్ సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.

సినిమాల లెక్క ఎలా ఉన్నా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి తన రెగ్యులర్ అప్డేట్స్ తో టచ్ లో ఉంటుంది రాధిక. ఇక లేటెస్ట్ గా అమ్మడు ఇప్పటి తారలకు ఏమాత్రం తీసిపోని విధంగా వెస్ట్రెన్ స్టైల్ కాస్టూంతో సత్తా చాటింది.

ఈ డ్రెస్ లో రాధికా ఓ పదేళ్లు చిన్నగా కనిపిస్తుందని హెప్పొచ్చు. స్లీవ్ లెస్ అందాలతో తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది రాధికా ఆప్టే. రోజుకొక కొత హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో ఇప్పటికీ తన టాలెంట్ చూపిస్తూ అవకాశాలు అందుకుంటుంది రాధికా. అయితే సోలో హీరోయిన్ గా ఛాన్సులు రాకున్నా తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం అన్నివిధాలుగా వాడుకుంటుంది రాధికా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.