Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గా మారిన స్టార్ హీరోయిన్.. టీజర్ కూడా రిలీజ్!

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:30 PM GMT
డైరెక్టర్ గా మారిన స్టార్ హీరోయిన్.. టీజర్ కూడా రిలీజ్!
X
నటసింహం బాలయ్య లెజెండ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే. సినీ ప్రపంచంలో రాధికా రూటే సెపెరేట్ అన్నట్లుగా డిఫరెంట్ గా ముందుకు సాగుతుంది. ఏ ఇండస్ట్రీ అయినా అమ్మడికి అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఇంతకాలం హీరోయిన్ గా అలరించిన రాధికా.. ఈసారి ఏకంగా డైరెక్షన్ చేయాలనీ నిర్ణయించుకుందట. యాక్టింగ్ సక్సెస్ అయింది మరి దర్శకత్వంలో తన అదృష్టం ఎలా ఉంటుందో చూస్తానంటుంది. ఇటీవలే నేచర్ మీద కాన్సెప్ట్ తయారు చేసుకొని 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించింది అమ్మడు.

హీరోయిన్ గా సక్సెస్ అయిన రాధిక ఇప్పుడు డైరెక్షన్ లోకి దిగేసరికి సోషల్ మీడియా అంత రాధికా గురించి చర్చ మొదలైంది. షహానా గోస్వామి, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘ఇదిగో మా టీజర్‌ ట్రైలర్‌’’అంటూ రాధిక ఇన్‌స్టాలో వీడియోను షేర్‌ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి స్లీప్ వాకర్ అనే టైటిల్ పెట్టారు. భార్య భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్‌.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ.. రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం..

ఆమెతో కలిసి షహానా బీచ్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక టీజర్‌ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. ‘‘ఐ యామ్‌ సారీ’’ అంటూ గుల్షన్‌ ఆమెను చిత్రహింసలకు గురిచేసే సీన్లు కాస్త భయంకరంగా ఉన్నాయని చెప్పాలి. ఈ షార్ట్ ఫిల్మ్ లో మానవుడికి వాతావరణానికి గల ఒక స్పెషల్ రిలేషన్ ని హైలెట్ గా చూపించబోతున్నట్లు ఇదివరకే నిర్మాతలు తెలిపారు. గతంలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాధికా ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ తీయడం పై నెటిజన్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీజర్ అయితే అదుర్స్ అని నెటిజన్లు అంటున్నారు.