Begin typing your search above and press return to search.
రజినీకాంత్ ఎంత సింపుల్ అంటే..
By: Tupaki Desk | 24 May 2016 11:00 PM ISTసౌత్ సినిమాల్లో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యం హీరోయిన్లకు ఇవ్వరని.. అమ్మాయిల్ని చాలా తక్కువగా చూస్తారని.. ఇకపై ఇక్కడ సినిమాలే చేయనని అలిగి వెళ్లిపోయింది రాధికా ఆప్టే. కానీ రజినీకాంత్ తో సినిమా అనగానే తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇదేంటి మాట తప్పావ్ అంటే.. సూపర్ స్టార్ చాలా స్పెషల్ అని.. అయినా కబాలి టీంతో తనకే ఇబ్బందీ రాలేదని.. రజినీ సహా అందరూ తనను చాలా బాగా చూసుకున్నారని.. రజినీకాంత్ లాంటి సింస్లిసిటీ ఉన్న హీరోను ఇంకెక్కడా చూడలేదని ఆ మధ్య సూపర్ స్టార్ మీద ప్రశంసలు కురిపించేసింది ఈ ముంబయి భామ. తాజాగా మరోసారి రజినీ సింప్లిసిటీ గురించి చెబుతూ ఆయన్ని ఆకాశానికెత్తేసింది.
‘‘రజినీ ఎంత సింపులో ఒక్క ఉదాహరణ చెబుతాను. ఆయన్ని కలవడానికి మొదటిసారి వెళ్తూ ఆ సంగతి ఇన్ఫామ్ చేశాను. ఆయన ఫలానా చోట వున్నారని చెప్పారు. అక్కడికి వెళ్తే ఆయన నన్ను లోపలికి తీసుకు వెళ్లడానికి గుమ్మం దగ్గర నిలబడి వున్నారు. నన్ను నేనే నమ్మలేకపోయాను. రజినీ సింపుల్ గా ఉంటారని తెలుసు కానీ.. మరి ఇంత సింపుల్ అనుకోలేదు. ఇలాంటి స్టార్ హీరోని ఎక్కడా చూడలేదు. రజినీ సార్ సెట్లో వుండే తీరు చూసి మైండ్ బ్లాక్ అయ్యేది. అంత క్రమశిక్షణ వున్న నటుడ్ని చూడలేదు. నెలల తరబడి ఒక్కరోజు విరామం లేకుండా ఆయన పని చేసేవారు'' అంటూ రజినీ గురించి చెప్పింది రాధిక.