Begin typing your search above and press return to search.

నటన ఇన్వెస్టిగేషన్ అంటున్న హీరొయిన్

By:  Tupaki Desk   |   16 Jan 2019 11:06 AM IST
నటన ఇన్వెస్టిగేషన్ అంటున్న హీరొయిన్
X
తెలుగులో బాలకృష్ణ లెజెండ్ తో మంచి గుర్తింపే తెచ్చుకున్నా రాధిక ఆప్టేకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు కలిసి రాలేదు. తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయి గ్లామర్ రోల్స్ తో పాటు బోల్డ్ గా నటించేందుకు ఏ మాత్రం మొహమాటం పడకపోవడంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఓ సినిమాలో నగ్నంగా నటించేందుకు సైతం వెనుకాడకపోవడంతో ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. ఇటీవలి కాలంలో నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న అన్ని వెబ్ మూవీస్ లోనూ కనిపిస్తున్న రాధిక ఆప్టే మీద సదరు సంస్థ మీద సోషల్ మీడియాలో జోకులు కనిపిస్తూనే ఉంటాయి. ఆఫ్ కోర్స్ వాళ్ళూ వీటిని స్పోర్టివ్ గా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు లెండి.

ఇదిలా ఉంచితే రాధికా ఆప్టే కొత్త ఇండిపెండెంట్ మూవీ బాంబరియా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్న రాధికా ఆప్టే నటన గురించి కొత్త సంగతులు చెబుతోంది. తనకెపుడూ ఆసక్తి రేపే స్పూర్తిదాయకమైన పని ఇష్టమని చెబుతున్న రాధికా నిత్యం ఏదో ఒకటి అన్వేషించేలా జీవితం లేకపోతే ఛాలెంజింగ్ రోల్స్ చేయలేమని చెబుతోంది. కామెడీ మిస్టరీ నేపధ్యంలో రూపొందుతున్న బాంబరియా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

సిద్దార్థ్ కపూర్-అక్షయ్ ఒబెరాయ్-ఆదిల్ హుసేన్-శిల్ప శుక్లా తదితరులు నటించిన ఈ మూవీ మూడు జీవితాలకు సంబంధించిన ఓ కీలకమైన సంఘటన చుట్టూ తిరుగుతుంది. అదేంటో తెరమీద చూసి ఎంజాయ్ చేయమంటోంది రాధికా ఆప్టే. విదేశీ ప్రియుడితో డేటింగ్ లో ఉన్న రాధికా దాని గురించి ప్రస్తావిస్తే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అని చెబుతోంది. గత ఏడాది మంచి సక్సెస్ లతో జోరుమీదున్న రాధికా ఆప్టే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందన్న నమ్మకంతో ఉంది