Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందాలతో ఎర!!

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:00 PM IST
ఫోటో స్టోరి: అందాలతో ఎర!!
X
రాధిక ఆప్టేలో రెండు కోణాలున్నాయి. ఒకటి బైటికి కనిపించే కోణం, ఇంకొకటి కనిపించని ఆ రెండో కోణం. అప్పటికప్పుడు లంగా ఓణీ, మిడ్డీ పరికిణీ అంటూ ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పొట్టినిక్కరు, చిట్టి గౌనుల్లో దర్శనమిస్తుంది. హైదరాబాద్‌లో తిరిగితే ఒకలా, ముంబైలో అడుగుపెడితే ఇంకోలా కనిపిస్తుంది. ఎక్కడి వాతావరణానికి తగ్గట్టు అక్కడ డ్రెస్సింగ్‌ చేసుకుంటుంది.

అంతేకాదండోయ్‌.. ఇదే విలక్షణత ఆన్‌స్క్రీన్‌పైనా చూపించి మెప్పిస్తుంది ఈ భామ. అనురాగ్‌ దర్శకత్వంలో న్యూడ్‌ సీన్స్‌లో నటించిన ఈవిడేనా.. లెజెండ్‌, లయన్‌లో పద్ధతిగా చీరకట్టులో కనిపించింది అని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఇదిగో ఇక్కడ కనిపించేదే అసలు సిసలు రూపం. పద్ధతిగా కనిపించినట్టే కనిపించి పాక్షికంగా అందాల్ని ఎర వేస్తుందిలా. ముఖానికి మేకప్‌ లేదు. తలకట్టు చెరిగిపోయింది. కింద పెద్ద పెద్ద బటన్స్‌తో డిజైనర్‌ మిడ్డీ, ఆ పైన వెరైటీ డిజైనర్‌ టాప్‌. అసలు ఆ రహస్యం అంతా ఆ టాప్‌లోనే దాగుంది.

మొత్తం కవర్‌ చేసేస్తున్నట్టు కనిపించినా లోన దాగిన అందాల్ని ఆరాంగా చూపిస్తోంది. 'తెల్ల రంగు'లో ఎంత కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తున్నా.. అదంతా ఎదుటివారిని నమ్మిచడానికే, మోసగించడానికేనని అనిపిస్తోంది. అయినా ఇదంతా తీయని మోసం! అన్నట్టు రాధిక మళ్లీ టాలీవుడ్‌లో కనిపించేదెప్పుడో?