Begin typing your search above and press return to search.

ఔరా! అనేలా బ్రాలో ఆప్టే అందాల ఆర‌బోత‌!!

By:  Tupaki Desk   |   8 Sep 2022 2:50 PM GMT
ఔరా! అనేలా బ్రాలో ఆప్టే అందాల ఆర‌బోత‌!!
X
కొన్ని ఎక్స్ ప్రెష‌న్స్ .. కొన్ని ర‌కాల డ్రెస్ లు ఔరా! అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక డిజైన‌ర్ లుక్ తో రెబ‌ల్ క్వీన్ రాధికా ఆప్టే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాధికా ఆప్టే మిరుమిట్లు గొలిపే లుక్స్ వీక్ష‌కుల‌ను మంత్రముగ్ధులను చేసాయంటే అతిశ‌యోక్తి కాదు.

టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే కెమెరా గ్లిజ్ నుంచి కొంతకాలంగా విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గ్యాప్ త‌ర్వాత‌ ఇప్పుడు తిరిగి గేమ్ లోకి వచ్చింది. తాను న‌టించిన `విక్రమ్ వేద` ప్రచార కార్యక్రమాల‌తో బిజీ బిజీగా మారింది. తాజా ఈవెంట్లో ఆప్టే నల్లని బ్రాలెట్ మ్యాచింగ్ ప్యాంట్ తో అబ్బురపరిచింది. త‌న చుట్టూ ఉన్న ప్రేక్షకులను ఆప్టే ఎంతో మంత్రముగ్ధులను చేసింది. విక్రమ్ వేద ట్రైలర్ లాంచ్ కోసం హృతిక్ రోషన్- రాధికా ఆప్టే ఇతర చిత్ర‌బృందం ఎంతో స్టైలిష్ గా విచ్చేశారు.

హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన విక్రమ్ వేద విడుదల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పటి నుండి ప్ర‌జ‌లంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. ఇందులో రాధికా ఆప్టే పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.

రోహిత్ సరాఫ్- యోగితా బిహానీ - షరీబ్ హష్మీ త‌దిత‌రులు తారాగ‌ణంలో ఉన్నారు. విక్రమ్ వేద 2017 తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ కి హిందీ రీమేక్. ఒరిజిన‌ల్ లో ఆర్ మాధవన్ - విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన పుష్కర్- గాయత్రి జోడీ హిందీ వెర్ష‌న్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఫస్ట్ లుక్ - టీజర్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన తర్వాత `విక్రమ్ వేధ` ట్రైలర్ ఈ రోజు లాంచ్ అయింది. ముంబైలో జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో తారాగ‌ణం స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స్టైలిష్ లుక్ తో విచ్చేశారు. హృతిక్ బ్లాక్ టీ-షర్ట్ ధరించి దానిపై తెల్లటి పూల చొక్కాను తొడిగాడు. రాధిక నల్లటి క్రాప్ టాప్ - ఫ్లెర్డ్ ప్యాంట్ లో స్టన్నింగ్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. రోహిత్- యోగిత- నిర్మాత భూషణ్ కుమార్- పుష్కర్- గాయత్రి కూడా ఈ వేడుక‌కు వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సైఫ్ హాజరుకాలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.