Begin typing your search above and press return to search.

రాధికా ఆప్టేతో అలా ప్రవర్తించిన నటుడెవరు?

By:  Tupaki Desk   |   21 Sept 2016 4:59 PM IST
రాధికా ఆప్టేతో అలా ప్రవర్తించిన నటుడెవరు?
X
హీరోయిన్లకు అవకాశాలిస్తామంటూ వాడుకోవడానికి చూసే జనాలు చాలామందే ఉంటారు ఇండస్ట్రీలో. ఇది ఏ ఒక్క ఇండస్ట్రీకో పరిమితం కాదు. అన్ని చోట్లా ఉంటుంది. ఐతే కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాధికా ఆప్టేతో ఒక సౌత్ ఇండియన్ నటుడు కొంచెం తేడాగా ప్రవర్తించాడట. రాధికను అతను ఫ్లర్ట్ చేయబోతే.. ఆమె చాలా గట్టిగా రివర్సయ్యేసరికి సైలెంటైపోయాడట.

‘‘నా కెరీర్ తొలినాళ్లలో అందరిలానే నాకూ సినిమా కష్టాలు తప్పలేదు. అయితే అవకాశం కోసం ఎప్పుడూ నేను అడ్డదారి మాత్రం తొక్కలేదు. ఎప్పుడో ఓసారి ఓ నటుడు... దక్షిణాదికి చెందిన వాడనుకుంటా.. ఫోన్‌ చేసి నాతో తేడాగా మాట్లాడాడు. ఫ్లర్ట్ చేయబోయాడు. నాకు ఒక్కసారిగా కోపం నషాళానికి అంటింది. నేను రూడ్ గా మాట్లాడటంతో అతను సైలెంటయ్యాడు. ఐతే అవకాశాల ఆశ చూపి.. తమతో గడపమని ఎవరూ నన్ను అడగలేదు’’ అని చెప్పింది రాధిక.

ఆల్రెడీ సౌత్ ఇండియన్ సినీ జనాల మీద ఓసారి విరుచుకుపడింది రాధిక. ఇక్కడ మేల్ డామినేషన్ బాగా ఎక్కువని.. తనను చాలా తక్కువగా చూశారని.. అందుకే ఇకపై మళ్లీ సౌత్ సినిమాల్లో నటించనని చెప్పింది రాధిక. ఆమె విమర్శలు ప్రధానంగా టాలీవుడ్ మీదే అన్న సందేహాలు కలిగాయి. ఐతే అసలు సౌత్ ఇండియాకే రానన్న రాధిక ఈ మధ్య ‘కబాలి’ సినిమాలో నటించింది. రాధిక లేటెస్ట్ మూవీ ‘పార్చ్డ్’ సాంఘిక దురాచారాలపై అమ్మాయిల పోరాటం నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమలో అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవాలపై మాట్లాడింది రాధిక.